ఈ వీకెండ్ విన్నర్ సుహాసే
ఈ వీకెండ్ లో చిన్న సినిమాలు కాస్త ఎక్కువగానే రిలీజ్ అవ్వగా.. అంబాజీపేట మ్యారేజి బ్యాండ్ విన్నర్ గా నిలిచిందని సినీ పండితులు చెబుతున్నారు.
చిన్న పాత్రలతో మొదలుపెట్టి హీరోగా ఎదిగిన నటుడు సుహాస్. కలర్ ఫొటో, రైటర్ పద్మభూషణ్ చిత్రాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. స్టోరీల ఎంపికలో తనదైన స్టైల్ చూపిస్తూ సినిమాలు చేస్తున్నాడు. సుహాస్ నటించిన లేటెస్ట్ మూవీ అంబాజీపేట మ్యారేజి బ్యాండ్ నిన్ననే థియేటర్లలో విడుదలైంది.
ఈ సినిమాతో దుశ్యంత్ కటికనేని డైరెక్టర్ గా పరిచయమవ్వగా.. శరణ్య ప్రదీప్, శివానీ నాగరం కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ అన్ని వర్గాల సినీ అభిమానుల నుంచి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అందుకుని దూసుకుపోతోంది. టికెట్ బుకింగ్స్ ప్లాట్ పామ్స్ లో స్టార్ రేటింగ్స్ దక్కించుకున్న ఈ సినిమా.. విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటోంది. ఈ వీకెండ్ లో చిన్న సినిమాలు కాస్త ఎక్కువగానే రిలీజ్ అవ్వగా.. అంబాజీపేట మ్యారేజి బ్యాండ్ విన్నర్ గా నిలిచిందని సినీ పండితులు చెబుతున్నారు.
సినీ ప్రియుల పాజిటివ్ మౌత్ టాక్.. మూవీకి మంచి హెల్ప్ అవుతుందని సినీ పండితులు చెబుతున్నారు. అందుకు ఉదాహరణ.. నిన్న నైట్ షోలేనని అంటున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జోరుగా సాగుతున్నాయని, ఈ వీకెండ్ లో సినీ లవర్స్ కు అంబాజీపేట మ్యారేజి బ్యాండ్ బెస్ట్ సెలక్షన్ గా చెబుతున్నారు. వీకెండ్ లో మంచి వసూళ్లు సాధించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
స్టోరీ లైన్ ఇదే..
అంబాజీపేట మ్యారేజి బ్యాండ్ లో ఓ సభ్యుడు మల్లి (సుహాస్). గ్రామంలో తన కుటుంబంతో కలిసి నివసిస్తుంటాడు. అక్క పద్మ (శరణ్య) ఆ ఊరి స్కూల్లో టీచర్ గా పనిచేస్తుంటుంది. ఊరి మోతుబరి వెంకట్ బాబు (నితిన్ ప్రసన్న) వల్లే పద్మకు ఉద్యోగం వచ్చిందని, వాళ్లిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉందనే రూమర్ ఊర్లో చక్కర్లు కొడుతుంటుంది. ఇంతలో వెంకట్ బాబు చెల్లి లక్ష్మి (శివాని), మల్లి ప్రేమలో పడతారు. వెంకట్ బాబు తమ్ముడికి, మల్లికి మధ్య గొడవ, ఆ తర్వాత స్కూల్ విషయంలో పద్మకు, వెంకట్‌బాబుకు మధ్య వైరం మొదలవుతుంది.
అలా అవి పెద్ద గొడవల్లా మారుతాయి. అదే టైంలో మల్లి, లక్ష్మిల ప్రేమ విషయం కూడా బయటపడుతుంది. ఎలాగైనా ఆ కుటుంబంపై రివెంజ్ తీర్చుకోవాలని ఓ రోజు వెంకట్ బాబు.. రాత్రివేళలో పద్మను స్కూల్ కు పిలిపించి అవమానిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? మల్లి, లక్ష్మిల ప్రేమకథ ఎలాంటి టర్న్ తీసుకుందనేది మిగతా కథ.