50 ఏళ్ల వయసులో పెళ్లి..పిల్లలు అమ్మమ్మ అని పిలవాలి!
తాజాగా ఈ ప్రచారంపై సుకన్య స్పందించారు. పదుల వయసులో ఉన్న నాకు మరో పెళ్లా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసారు.
సీనియర్ నటి సుకన్య సుపరిచితమే.'పెద్దరికం', 'అమ్మకొడుకు', 'సాంబ', 'శ్రీ', 'మున్నా', 'అధినాయ కుడు', 'శ్రీమంతుడు' లాంటి చిత్రాల్లో నటించారామె. తెలుగుకంటే తమిళ్..మలయాళంలో భాగా ఫేమస్ అయిన నటి. అక్కడ చాలా సినిమాల్లో నటించారు. కన్నడలోనూ కొన్ని సినిమాలు చేసారు. డబ్బింగ్ ఆర్టిస్ట్ గానూ సుకన్య ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్నారు. ప్రస్తుతం తెలుగులోనూ సినిమాలు చేస్తున్నారు. అయితే ఆమె వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాలో కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
సుకన్య మరో పెళ్లి చేసుకోబోతున్నారంటూ నెట్టింట పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. తాజాగా ఈ ప్రచారంపై సుకన్య స్పందించారు. పదుల వయసులో ఉన్న నాకు మరో పెళ్లా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసారు. ఇప్పటివరకు అలాంటి ఆలోచన నాకు లేదు. ఇప్పుడు నాకు 50 ఏళ్లు. ఇకపై పెళ్లి, పిల్లలు, సంసారం అంటూ పోతే... నాకు పుట్టే పిల్లలు నన్ను అమ్మ అని పిలుస్తారా? అమ్మమ్మ అని పిలుస్తారా? అనే ఆలోచన నామదిలో మెదులుతోంది' అని అన్నారు.
సుకన్య 2002 లో శ్రీధరన్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. వివాహం అనంతరం అమెరికా వెళ్లిపో యారు. కానీ ఏడాదిలోనే ఆ కాపురంలో కలతలు మొదలయ్యాయి. దీంతో విడాకులతో వేరయ్యారు. ఆ తర్వాత ఎవరి జీవితం వారిది. సుకన్య భారత్ కి తిరిగొచ్చి మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యారు. నటిగా అవకాశాలు లేక ఖాళీగా ఉన్నంత కాలం ఆమెపై ఎలాంటి ప్రచారం సాగలేదు. సెకెండ్ ఇన్నింగ్స్ లో బిజీ అవుతోన్న సమయంలో మళ్లీ పెళ్లి అంటూ పుకార్లు తెరపైకి వచ్చాయి.
వాస్తవానికి కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో ప్రచారంసాగుతోంది. కానీ ఇంతకాలం మౌనంగా ఉన్న సుకన్య లాభం లేదనకున్ని ఓ యూ ట్యూబ్ ఛాన్ ల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వాటిని ఖండించారు. ప్రముఖ దర్శకుడు భారతీరాజా దర్శకత్వం వహించిన 'పుదు నెల్లు పుదు నాత్తు' అనే తమిళ చిత్రం ద్వారా వెండితెరకు పరిచమయ్యారు. ఆ తర్వాత 'మహానది'.. 'చిన్న గౌండర్'.. 'వాల్టర్ వెట్రివేల్'.. 'ఇండియన్' వంటి అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించారు.