సుకుమార్ ఆవేద‌న‌

నిజానికి సుకుమార్ అమెరికాకు వెళ్లింది త‌న కూతురి అడ్మిష‌న్‌కు సంబంధించి. ఆయ‌న వెంట భార్య కూడా వెళ్లారు. అది ముందే షెడ్యూల్ అయిన ప్రోగ్రాం.

Update: 2024-07-20 04:49 GMT

గ‌త కొన్ని రోజులుగా పుష్ప-2 సినిమాకు సంబంధించి ఎంత గొడ‌వ‌న‌డుస్తోందో తెలిసిందే. ఆల్రెడీ ఆగ‌స్టు 15నుంచి డిసెంబ‌రు 6కు ఈ చిత్రం వాయిదా ప‌డ‌గా.. ఆ డేట్‌కు కూడా సినిమా రాక‌పోవ‌చ్చ‌ని.. షూటింగ్ స‌జావుగా సాగ‌క పో వ‌డ‌మే అందుక్కార‌ణ‌మ‌ని.. హీరో అల్లు అర్జున్, ద‌ర్శ‌కుడు సుకుమార్ మ‌ధ్య విభేదాలు నెల‌కొన్నాయ‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. సుకుమార్ అనుకున్న ప్ర‌కారం షూట్ చేయ‌కపోవ‌డం, షెడ్యూళ్లు ప‌దే ప‌దే మారుస్తుండ‌డంతో బ‌న్నీ గ‌డ్డం తీసేసి ఫారిన్ టూర్‌కు వెళ్లిన‌ట్లు కూడా ఇటీవ‌ల గ‌ట్టిగా రూమ‌ర్లు వినిపించాయి.

దీంతో సామాజిక మాద్య‌మాల్లో అంద‌రూ సుకుమార్‌నే నిందించ‌డం మొద‌లుపెట్టారు. నింద మొత్తం ఆయ‌న మీదే వేసేశారు. ఐతే బ‌న్నీకి, సుకుమార్‌కు మ‌ధ్య విభేదాలేమీ లేవ‌ని.. పుష్ప‌-2 షూట్ ఆగింద‌నే వార్త‌ల్లో నిజం లేద‌ని ఆ చిత్ర వ‌ర్గాల నుంచి.. అలాగే బ‌న్నీ పీఆర్ టీం నుంచి కూడా క్లారిఫికేష‌న్లు వ‌చ్చిన‌ప్ప‌టికీ.. సుకుమార్‌కు జ‌ర‌గాల్సిన డ్యామేజీ అయితే జ‌రిగిపోయింది.

నిజానికి సుకుమార్ అమెరికాకు వెళ్లింది త‌న కూతురి అడ్మిష‌న్‌కు సంబంధించి. ఆయ‌న వెంట భార్య కూడా వెళ్లారు. అది ముందే షెడ్యూల్ అయిన ప్రోగ్రాం. అంతే త‌ప్ప ఆయ‌న షూట్ క్యాన్సిల్ చేసి ఏమీ యుఎస్ వెళ్ల‌లేదు. ఆయ‌న ఆ ప‌నిలో బిజీగా ఉండి ఇక్క‌డికి వ‌చ్చేలోపు చాలా ప్ర‌చారాలు జ‌రిగిపోయాయి. సుకుమార్ ఏమైనా క‌ళాఖండం తీస్తున్నాడా.. ఇంత ఆల‌స్య‌మేంటి.. ఎన్నిసార్లు షూట్ క్యాన్సిల్ చేస్తాడు.. ఎందుకు మ‌ళ్లీ మ‌ళ్లీ సినిమా వాయిదా వేయిస్తున్నాడు అంటూ ఆయ‌న మీద బ‌న్నీ ఫ్యాన్స్‌తో పాటు న్యూట్ర‌ల్ నెటిజ‌న్స్ కూడా విరుచుకుప‌డిపోయారు.

త‌న గురించి జ‌రిగిన నెగెటివ్ ప్ర‌చార‌మంతా చూసి సుకుమార్ చాలా బాధ‌ప‌డిన‌ట్లు సమాచారం. తాను వీలైనంత త్వ‌ర‌గా చిత్రీక‌ర‌ణ పూర్తి చేయ‌డానికే ప్ర‌య‌త్నిస్తున్నాన‌ని..అనుకోని అవాంత‌రాలు కొన్ని త‌లెత్తాయ‌ని.. మ‌రోవైపు ఆగ‌స్టు 15 నుంచి సినిమాను వాయిదా వేయ‌డానికి తానొక్క‌డే కార‌ణం కాద‌ని ఆయ‌న అంటున్నార‌ట‌.

ఏపీలో అసెంబ్లీ ఎన్నిక‌లు, ఫ‌లితాల‌ టైంలో బ‌న్నీ మీద వ‌చ్చిన నెగెటివిటీ చూసి ఇప్పుడు సినిమాను రిలీజ్ చేస్తే చాలా డ్యామేజ్ త‌ప్ప‌దన్న ఉద్దేశంతో నిర్మాత‌లే వాయిదాకు మొగ్గు చూపార‌ని.. కానీ నింద మాత్రం త‌నే మోస్తున్నాన‌ని.. ఇప్పుడు ప‌నిగ‌ట్టుకుని కొంద‌రు సామాజిక మాధ్య‌మాల్లో త‌న మీద దుష్ప్ర‌చారం చేస్తున్నార‌ని ఆయ‌న ఆవేద‌న చెందుతున్న‌ట్లు తెలిసింది.

Tags:    

Similar News