టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సతీమణి స్టన్నింగ్ లుక్
అల్లు అర్జున్ ని పెద్ద తెరపై స్టైల్ ఐకాన్ గా ఆవిష్కరించారు సుకుమార్. ఆర్య, ఆర్య 2 సినిమాలతో బన్నీ ఇమేజ్ ని మార్చేసిన ఘనత సుక్కూ సొంతం.
అల్లు అర్జున్ ని పెద్ద తెరపై స్టైల్ ఐకాన్ గా ఆవిష్కరించారు సుకుమార్. ఆర్య, ఆర్య 2 సినిమాలతో బన్నీ ఇమేజ్ ని మార్చేసిన ఘనత సుక్కూ సొంతం. అదంతా సరే కానీ.. సుకుమార్ వైఫ్ తబిత మేకోవర్ కూడా అంతే ఆశ్చర్యపరుస్తోంది. తన భర్త సుక్కూ ఇచ్చిన స్ఫూర్తి అని అనాలో ఏమో కానీ, తబిత స్టైల్ ఐకాన్ గా మారిపోయారు. రెడ్ శారీలో స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించి ఫ్యాషనిస్టాను తలపిస్తున్నారు.
బాలీవుడ్ వైవ్స్ లో షాహిద్ కపూర్ సతీమణి మీరా చోప్రా, టాలీవుడ్ వైవ్స్ లో బన్ని వైఫ్ స్నేహారెడ్డి ఇంత స్టైల్ గా కనిపించారు. కానీ ఇప్పుడు ఇలా ఒక టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వైఫ్ అంతకుమించి స్టైలిష్ గా కనిపించడం ఆశ్చర్యపరుస్తోంది. రెండు రోజుల క్రితం క్రూయిజ్ షిప్ పార్టీలో క్రూయిజ్ పై నుంచి అందమైన ఫోటోగ్రాఫ్స్ బంచ్ ని షేర్ చేసిన తబిత దీనికి లవ్ యు జిందగీ పాటను బ్యాక్ గ్రౌండ్ లో చేర్చారు. క్రూయిజ్ పార్టీలో తబిత ఎంతో స్టైలిష్ గా కనిపించారు. ఇంతలోనే ఇప్పుడు ఈ కొత్త ఫోటోగ్రాఫ్ ఇంటర్నెట్ లోకి వచ్చింది.
ప్రస్తుతం గ్రీస్ లో విహారయాత్రను ఆస్వాధిస్తున్న తబిత అక్కడి నుంచి ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాల్లో షేర్ చేస్తున్నారు. అవన్నీ వైరల్ గా మారుతున్నాయి. ఇప్పుడు రెడ్ శారీ డిజైనర్ బ్లౌజ్ లో ఉన్న ఫోటోగ్రాఫ్స్ అంతే వైరల్ గా మారుతున్నాయి.
మీరంతా నన్ను ప్రేమించినందుకు దేవునికి ధన్యవాదాలు! ఈ మృధువైన ఆశీర్వాద జీవితానికి నేను చాలా కృతజ్ఞురాలిని. నా జీవితంలోని ఈ దశలో కంటే నేను ఎప్పుడూ సంతోషంగా, ఎక్కువ ఆత్మవిశ్వాసంతో లేను. ఇంతకుమించిన గొప్ప పీస్‌ని అనుభవించలేదు. నేను ముఖ్యమైన వాటిపై ఎక్కువ శ్రద్ధ వహించడం.. పట్టింపు లేని వాటిపై తక్కువ శ్రద్ధ వహించడం నేర్చుకున్నాను! నేను జీవితాన్ని ప్రేమిస్తున్నాను... జీవితం నన్ను తిరిగి ప్రేమిస్తుంది. వారు చెప్పినట్లు, జీవితం నిజంగా నలభైకి ప్రారంభమవుతుంది. అప్పటి వరకు.. మీరు పరిశోధన చేస్తున్నారు. కాబట్టి 40కి శుభాకాంక్షలు! అని రాసారు. తబిత 40వ పుట్టినరోజును ఇలా గ్రీస్ లో ప్లాన్ చేసారని దీనిని బట్టి అర్థమైంది.