గురువును మించిన శిష్యుడు అనిపించేలా!
ఇండస్ట్రీలో వర్మ ప్రియ శిష్యుడు ఎవరంటే? పూరి జగన్నాధ్ పేరు చెబుతారు. వర్మ దగ్గర ఎంత మంది పనిచే సినా ఆయన మెచ్చిన ఒకే శిష్యుడు పూరి.
ఇండస్ట్రీలో వర్మ ప్రియ శిష్యుడు ఎవరంటే? పూరి జగన్నాధ్ పేరు చెబుతారు. వర్మ దగ్గర ఎంత మంది పనిచే సినా ఆయన మెచ్చిన ఒకే శిష్యుడు పూరి. ఇద్దరి మధ్య బాండింగ్ అనేది పాలు-నీళ్లలా అన్ని రకాలుగా కలిసి పోతుంది. అందుకే ముంబై కి తీసుకెళ్లి అమితాబచ్చన్ ని పరిచయం చేసి మీతో సినిమా చేస్తానం టున్నాడు....చేయించుకోండి అని పూరికి అవకాశం కల్పించారు. అలాంటి అవకాశాలు వర్మ కేవలం పూరికి మాత్రమే కలిపించాడు. వర్మ శిష్యులు ఇండస్ట్రీలో వందల్లో ఉంటారు. కానీ పూరి ఎప్పటికీ వర్మ ప్రత్యేకం.
వాళ్లిద్దర్ని మినిహాయిస్తే మళ్లీ అలాంటి బాండింగ్ అనేది సుకుమార్-బుచ్చిబాబు మధ్య కనిపిస్తుంది. బుచ్చిబాబు కూడా మాష్టారు మెచ్చిన ప్రియ శిష్యుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. తొలి సినిమా ఉప్పెన తోనే తన ట్యాలెంట్ నిరూపించుకున్నాడు. అతడి ప్రతిభ గుర్తించే కాకినాడ నుంచి వచ్చి బుచ్చిబాబుకి శిష్యుడిగా అవకాశం కల్పించి మెలకువలు నేర్పించి మార్కెట్ లోకి వదిలాడు. ఇప్పుడు రామ్ చరణ్ తో అవకాశం రావడం వెనుక సుకుమార్ కీలక పాత్ర పోషించాడు అని అందరికీ తెలుసు.
ఇలా మరికొంత మంది శిష్యులు సుకుమార్ కి ఉన్నారు. కానీ ప్రియ శిష్యుడు మాత్రం బుచ్చిబాబే. అందుకే బుచ్చి బాబు సైతం గురువు ప్రతిష్టకు ఏమాత్రం భంగం కలిగించకుండా కెరీర్ పరంగా ముందుకెళ్తు న్నాడు. చరణ్ సినిమా కోసం వీలైనంతగా నేచురల్ ఔట్ ఫుట్ తీసుకునే పనిలో పడ్డాడు. అందుకే ఉత్తరాంద్ర మన్యం ప్రాంతాల్ని టార్గెట్ చేసి ఇక్కడ ఔత్సాహికులకు తన సినిమాలో అవకాశం కల్పించాడు.
ఇటీవలే విజయనగరం..శ్రీకాకుళం ప్రాంత వాసులకు తన సినిమాలో ప్రత్యేకంగా కల్పిస్తూ స్టార్ హంట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. స్టోరీ నేపథ్యం ఇక్కడికి బలంగా కనెక్ట్ కావడంతో సీనియర్ నటులు కన్నా కొత్త వాళ్లకి అవకాశం కల్పించి వాళ్లతోనే వండర్స్ క్రియేట్ చేయోచ్చు అన్న ఆలోచనతో బుచ్చిబాబు ముందుకు కదిలాడు. `పుష్ప` కోసం సుకుమార్ కూడా అలాగే వర్క్ చేసాడు. ఆ ప్రాజెక్ట్ ప్రారంభానికి ముందు చిత్తూరు యాసభాషల కోసం ఎంతగా శ్రమించాడో తెలిసిందే. ఇప్పుడు బుచ్చిబాబు కూడా అంతే నిబద్దతతో పనిచేస్తున్నాడు.