హాయ్ నాన్న.. సుకుమార్ శిష్యుడి పవర్ఫుల్ పెన్

ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ గా పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ డీసెంట్ కలెక్షన్స్ తో థియేటర్స్ లో నడుస్తోంది.

Update: 2023-12-12 04:01 GMT

నేచురల్ స్టార్ నాని హీరోగా శౌర్యువ్ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చిన సినిమా హాయ్ నాన్న. మృణాల్ ఠాకూర్ ఈ చిత్రంలో నానికి జోడీగా నటించింది. ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ గా పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ డీసెంట్ కలెక్షన్స్ తో థియేటర్స్ లో నడుస్తోంది. ఈ ఏడాది నాని ఖాతాలో సెకండ్ హిట్ మూవీగా హాయ్ నాన్న మారబోతోందని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాతో దర్శకుడు శౌర్యువ్ కి మంచి పేరు వచ్చింది. సెన్సిటివ్ ఎమోషన్స్ ని అద్భుతంగా తెరపై ఆవిష్కరించి ఆకట్టుకుననరనే ప్రశంసలు లభిస్తున్నాయి. మంచి ఫ్యామిలీ కథని ప్రేక్షకులకి అందించాడానికి సినీ విశ్లేషకులు అంటున్నారు. మరో వైపు మూవీకి డైలాగ్స్ రాసిన రైటర్ కి కూడా ప్రశంసలు లభిస్తున్నాయి. అసలు దైలార్ రైటర్ ఎవరనేది సోషల్ మీడియాలో వెతికేస్తున్నారు.

ఈ సినిమాకి డైలాగ్స్ రాసింది నాగేంద్ర కాశి. అతను సుకుమార్ శిష్యబృందంలో ఒకడనే టాక్ ఇప్పుడు వినిపిస్తోంది. అయితే సుకుమార్ టీమ్ లో జాయిన్ కావడానికి ముందే మరికొన్ని సినిమాలకి రైటింగ్ విభాగంలో పని చేశారంట. పలాస, శ్రీదేవి సోడా సెంటర్ సినిమాలకి కరుణ కుమార్ తో కలిసి రైటింగ్ టీంలో వర్క్ చేశారు.

రైటింగ్ మీద ఇష్టంతో కథలు రాస్తూ ఉండేవాడిని అని, తాను రాసిన నల్లవంతెన అనే కథ నచ్చి శౌర్యువ్ హాయ్ నాన్నకి అవకాశం ఇచ్చారని నాగేంద్ర కాశి తెలిపారు. ఈ సినిమాలో హీరో కూతురు పాత్రకి రాసిన సంభాషణలకి థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే వాటిని ఆ క్యారెక్టర్ మెచూరిటీ లెవల్ కి తగ్గట్లుగా రాయడానికి చాలా కష్టపడ్డానని ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

ప్రస్తుతం నాగేంద్ర కాశి పుష్ప 2, బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కబోయే సినిమాకి, రష్మిక రెయిన్ బో సినిమాకి రైటింగ్ టీంలో వర్క్ చేస్తున్నారంట. రైటింగ్ లో తన బెస్ట్ ఇవ్వడంపైనే ప్రస్తుతం తన దృష్టి అంతా ఉందని నాగేంద్ర కాశి ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

Tags:    

Similar News