సుకుమార్ ఫ్యామిలీని చూశారా..?
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో ఒకరైన సుకుమార్ తన సినిమాలతో ప్రతిభ చాటుతూ వచ్చారు
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో ఒకరైన సుకుమార్ తన సినిమాలతో ప్రతిభ చాటుతూ వచ్చారు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో ఆయన ప్రభంజనం తెలిసిందే. బీ టౌన్ ఆడియన్స్ కి పుష్ప రాజ్ మాస్ యాటిట్యూడ్ ఆ రేంజ్ లో ఎక్కిందంటే సుకుమార్ ఐడియాలజీని అర్ధం చేసుకోవచ్చు. పుష్ప 1 సెన్సేషనల్ హిట్ కాగా ఇప్పుడు పుష్ప 2కి అదే రేంజ్ ప్లానింగ్ లో ఉన్నాడు సుక్కు. ఆగష్టు 15న పుష్ప 2 రిలీజ్ అవుతుండగా టార్గెట్ ఏమాత్రం మిస్ అవ్వకూడదని సుకుమార్ డే అండ్ నైట్ కష్టపడుతున్నాడని తెలుస్తుంది.
ప్రొఫెషనల్ గా పర్ఫెక్ట్ గా ఉన్న వారు ఫ్యామిలీ విషయంలో కాస్త అసంతృప్తిగా ఉంటారు. కానీ సుకుమార్ లెక్కల మాస్టారు కాబట్టి ప్రొఫెషనల్ లైఫ్ తో పాటుగా ఫ్యామిలీ లైఫ్ ని కూడా బ్యాలెన్స్ చేస్తుంటాడు. ఆ లెక్క సరిగా లేకపోతే సుకుమార్ పనిచేయడం కష్టం. అందుకే సినిమా పూర్తి కాగానే ఫ్యామిలీతో కొన్నాళ్లు సరదాగా గడుపుతుంటాడు సుకుమార్. సినిమా షూటింగ్ లో ఫ్యామిలీకి ఏమాత్రం టైం ఇవ్వని సినిమా వాళ్లు ఏమాత్రం గ్యాప్ దొరికినా సరే ఆ టైం అంతా ఫ్యామిలీతో గడిపేందుకు చూస్తుంటారు.
సుకుమార్ కూడా పుష్ప 2 షూటింగ్ కి కొంత గ్యాప్ ఇవ్వడంతో ఫ్యామిలీతో అలా సరదాగా గడుపుతున్నాడు. ఆయన వైఫ్ తబిత ఇద్దరు పిల్లలు చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అనిపించేలా ఫ్యామిలీ అంతా చాలా క్యూట్ గా అనిపిస్తుంది. సుకుమార్ ఫ్యాన్స్ కి ఆయన ఫ్యామిలీ ఫోటో సర్ ప్రైజ్ చేస్తుంది. సుకుమార్ ఎప్పుడు ఇలాంటివి తన సోషల్ మీడియా పేజ్ లో షేర్ చేయకపోయినా ఆయన భార్య తబిత ఈ ఫోటోలను షేర్ చేశారు.
ఇక సినిమాల విషయానికి వస్తే సుకుమార్ పుష్ప 2 పూర్తి చేసే పనుల్లో బిజీగా ఉండగా అల్లు అర్జున్ కూడా ఈ సినిమాతో మళ్లీ రికార్డులు కొట్టాలని కసిగా ఉన్నాడు. పుష్ప 2 నుంచి లాస్ట్ ఇయర్ వచ్చిన ఒక టీజర్ సినిమాపై అంచనాలు డబుల్ చేయగా త్వరలోనే మరో కొత్త టీజర్ ని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. పుష్ప 1 బ్లాక్ బస్టర్ అవ్వడంతో పుష్ప 2 బిజినెస్ ఒక రేంజ్ లో జరుగుతుందట. బాలీవుడ్ లోనే ఈ సినిమా కోసం అక్కడ బడా డిస్ట్రిబ్యూటర్స్ వందల కోట్లు పెట్టేందుకు రెడీగా ఉన్నారని తెలుస్తుంది.