మలేషియాలో పుష్ప రాజ్ భీభత్సం!
మలేషియా బ్యాక్ డ్రాప్ లో షూట్ చేయాల్సిన సన్నివేశాలు ఉండటంతో మలేషియా సెట్ ని సిద్దం చేసి అందులోనే షూట్ చేస్తున్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న 'పుష్ప-2' షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది. ఎన్నికల సందర్భంగా బన్నీ కాస్త విరామం తీసుకుని ఇటీవలే మళ్లీ సెట్స్ లో జాయిన్ అయ్యాడు. ఎట్టి పరిస్థితుల్లో జూన లోగా షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని సుకుమార్ డే అండ్ నైట్ పనిచేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలో షూటింగ్ జరుగుతోంది. ఇక్కడ ప్రత్యేకంగా మలేషియా అందాల్నే సృష్టించారు. మలేషియా బ్యాక్ డ్రాప్ లో షూట్ చేయాల్సిన సన్నివేశాలు ఉండటంతో మలేషియా సెట్ ని సిద్దం చేసి అందులోనే షూట్ చేస్తున్నారు.
గత రెండు వారాలుగా సుకుమార్ అండ్ కో ఆ పనుల్లోనే బిజీగా ఉన్నట్లు తెలిసింది. ఇందులో బన్నీ..పహాద్ ఫాజిల్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉందిట. బన్నీ రెడీగా ఉన్నా? పహాద్ డేట్లు జూన్ 1 నుంచి కేటాయించారు. వాళ్లిద్దరి మధ్య దాదాపు 15 రోజుల పాటు షూట్ చేయాల్సిన సన్నివేశాలున్నట్లు తెలుస్తోంది. అలాగే షూట్ కి సంబంధించి పెండింగ్ వర్క్ కూడా ఉంది. ఆపనుల్లో సుకుమార్ శిష్యులు బిజీగా ఉన్నారు. ఒకేసారి రెండు రకాలుగా షూటింగ్ ప్లాన్ చేసి సుకుమార్ ముందుకెళ్తున్నారు.
అలాగే ఐటం పాట కూడా చిత్రీకరించాల్సి ఉంది. తొలి భాగం మించి రెండవ భాగంలో ఐటం సాంగ్ పేలాలి కాబట్టి! ఆ పాటలో ఏ భామ నటిస్తుంది? అన్న దానిపై క్లారిటీ రావాలి. ఎవర్ని ఎంపిక చేయాలి? అన్న దానిపై సుకుమార్ రెండు..మూడు నెలలుగా తర్జన భర్జన పడుతున్నారు. స్టార్ హీరోయిన్ ఎవరినైనా ఒప్పించాలా? లేక ముంబై నుంచి ఐటం స్పెషలిస్ట్ ని దించాలా? అన్న దానిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడిదే ప్రధానంగా సుకుమార్ కి సవాల్ గా మారింది.
ఇప్పటికే కొంత మంది భామల పేర్లు తెరపైకి వచ్చాయి గానీ..ఆ పాటలో వాళ్లు ఫిట్ అవ్వడం లేదని సుకుమార్ వాళ్లని లైట్ తీసుకునే అవకాశం ఉందంటున్నారు. ఇందులో బన్నీకి జోడీగా రష్మిక మందన్నా నటిస్తోన్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.