జానీ మాస్టర్ కేసు: బెయిల్ వ‌స్తుందా రాదా?

ప్ర‌స్తుతం జానీ మాస్టార్ బెయిల్ కోసం తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు.

Update: 2024-09-29 10:33 GMT

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై మ‌హిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫ‌ర్ అత్యాచార ఆరోప‌ణ‌లు చేయ‌గా, అత‌డు అరెస్ట్ అయి జైలులో ఉన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం జానీ మాస్టార్ బెయిల్ కోసం తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు. దీనిపై రంగారెడ్డి కోర్టులో విచార‌ణ జ‌ర‌గ‌నుంది.

చ‌ట్ట ప్ర‌కారం.. పోక్సో కేసులో అరెస్టయిన జానీ మాస్టర్‌ నాలుగు రోజులుగా పోలీస్ కస్టడీ ముగియడంతో.. అత‌డిని ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచి అటుపై చంచల్‌ గూడ జైలుకు తరలించారు. బాధితురాలు ఆరోప‌ణ ప్ర‌కారం.. స‌రైన‌ ఎవిడెన్స్ కోసం పోలీసులు సీరియ‌స్ గా ప్ర‌య‌త్నిస్తున్నార‌ని స‌మాచారం. అలాగే జానీ మాస్టర్‌ బెయిల్‌ పిటిషన్‌ పై రంగారెడ్డి కోర్టులో సోమవారం విచారణ జరగబోతుంది. బెయిల్ వ‌స్తుందా రాదా? అన్న‌ది ఇప్ప‌టికి స‌స్పెన్స్. క‌స్ట‌డీలో జానీ మాస్టార్ త‌న అసిస్టెంట్ కొరియోగ్రాఫ‌ర్ పైనే ప్ర‌త్యారోప‌ణ‌లు చేసార‌ని కొన్ని క‌థ‌నాలు వెలువ‌డ్డాయి. కానీ ఈ కేసులో నిజం ఏమిట‌న్న‌ది తెలియాల్సి ఉంది.

ఛాంబ‌ర్‌లో జానీ మాస్ట‌ర్ వైఫ్ ఫిర్యాదు:

జానీ మాస్ట‌ర్ పై విచార‌ణ స‌మ‌యంలో భార్య సుమలత అత్యాచారం ఆరోపణల బాధితురాలిపై సంచలన ఆరోపణలు చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఫిలిం ఛాంబర్‌లో ఫిర్యాదు చేసిన బాధితురాలు తానే తన భర్తను ట్రాప్ చేశానని, అత‌డిని అసిస్టెంట్ కొరియోగ్రాఫ‌ర్ ఇబ్బంది పెట్టింద‌ని పేర్కొన్నారు. సుమలత మాట్లాడుతూ.. ‘‘నా భర్తను ఇంటికి రాకుండా అడ్డుకుంది. ఐదేళ్లు నాకు నరకం. చివరకు ఆత్మహత్యకు ప్రయత్నించేంత వరకు బాధించింది. ఈ బాధితురాలికి జానీ మాస్టర్‌ సహా పలువురితో సంబంధాలు ఉన్నాయి. ఇది తెలిసిన తర్వాత, జానీ ఆమెను దూరం చేసాడు. అందుకే ఆమె తన భర్తపై కక్ష సాధిస్తోంది`` అన్నారు. సుమలత తన భర్త, బాధితురాలు, ఆమె తల్లి మధ్య జరిగిన సంఘటనలను వివరించింది.

ఈ కేసులో నిజమైన బాధితురాలు అమ్మాయి కాదు.. నేను.. మమ్మల్ని వేధించి తప్పుడు కేసు పెట్టిన అమ్మాయి, ఆమె తల్లిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. మాకు ఏమైనా జరిగితే దానికి వారే బాధ్యత వహించాలని, న్యాయం చేయాలని ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌లో ఫిర్యాదు చేస్తున్నాను అని సుమలత అన్నారు.

Tags:    

Similar News