బాక్సాఫీస్.. సమ్మర్ హాలిడేస్ వృధా!
టాలీవుడ్ ఇండస్ట్రీకి సమ్మర్ సీజన్ బిగ్ బోనాంజా లాంటిది. ఈ టైంలో పబ్లిక్ హాలిడేస్ మొదలవుతాయి.
టాలీవుడ్ ఇండస్ట్రీకి సమ్మర్ సీజన్ బిగ్ బోనాంజా లాంటిది. ఈ టైంలో పబ్లిక్ హాలిడేస్ మొదలవుతాయి. అందుకే సినిమాలు చూడటానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. ప్రతి వేసవి సీజన్ లో స్టార్ హీరోలు తమ సినిమాలు రిలీజ్ ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. సినిమాకి వేసవి సీజన్ లో స్ట్రాంగ్ ఓపెనింగ్స్ తో పాటు లాంగ్ రన్ కలెక్షన్స్ వస్తాయని నమ్ముతారు. కరెక్ట్ గా పెద్ద సినిమాలు సమ్మర్ లో క్లిక్కయితే పాన్ ఇండియా రేంజ్ లో 500 కోట్లకు పైగానే బిజినెస్ చేస్తాయి.
అందుకే ఎక్కువ వేసవి సీజన్ ని మన హీరోలు వదులుకోవడానికి ఇష్టపడరు. అసలే ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా బ్రాండ్ తో మూవీస్ చేస్తున్న నేపథ్యంలో కలెక్షన్స్ భారీగా రాబట్టాలి. దీనికి సంక్రాంతి తర్వాత వేసవి సీజన్ మాత్రమే బాగుంటుందని నిర్మాతల అభిప్రాయం కూడా. అయితే ఈ ఏడాది వేసవి సీజన్ లో స్టార్ హీరోల చిత్రాలు వచ్చే అవకాశం తక్కువ అనే మాట వినిపిస్తోంది.
నిజానికి పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ డేట్స్ అయితే వేసవి సీజన్ లో ఎనౌన్స్ అయ్యి ఉన్నాయి. వాటిలో దేవర మూవీ మొదటిగా ఉంది. ఈ సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ అవుతుందని ఇప్పటికే కన్ఫర్మ్ చేశారు. అయితే మూవీ షూటింగ్ ఇంకా కంప్లీట్ కాలేదు. దీంతో వాయిదా పడే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి 2898 ఏడి మూవీ కూడా మేలో రిలీజ్ చేస్తామని అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు.
అయితే ఇంకా ఈ మూవీ సీజీ వర్క్ కంప్లీట్ కాలేదని తెలుస్తుంది. గ్లోబల్ మూవీగా కల్కి సినిమాని నాగ్ అశ్విన్ సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరిస్తున్నారు. ఈ నేపథ్యంలో క్వాలిటీ విషయంలో ఏమాత్రం రాజీ పడిన అది సినిమా రిజల్ట్ పై ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. అందుకే గ్రాఫిక్స్ వర్క్ ఆలస్యమైతే సినిమా పోస్ట్ పోన్ చేసే అవకాశం ఉందని సమాచారం.
రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ కూడా వేసవిలో వచ్చే అవకాశం అయితే లేదు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇండియన్ 2 వేసవిలో థియేటర్స్ లోకి రాబోతుంది. దీని తర్వాత గేమ్ చేంజర్ రిలీజ్ కానుంది. టిల్లు స్క్వేర్, విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమాలు మాత్రమే ఈసారి వేసవి సీజన్ ఆరంభంలో కాస్త సందడి చేయబోతున్నాయి