ఆ హిట్ ప్రాంచైజీ పై గాలి ప్ర‌చారాలొద్దు!

ద‌ర్శ‌కుడు సుంద‌ర్. సి ఎత్తుకున్న `ఆర‌ణ్మ‌ణై` ప్రాంచైజీ ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పాల్సిన ప‌నిలేదు.

Update: 2024-10-27 07:12 GMT

ద‌ర్శ‌కుడు సుంద‌ర్. సి ఎత్తుకున్న `ఆర‌ణ్మ‌ణై` ప్రాంచైజీ ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ ప్రాంచైజీ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ నాలుగు సినిమాలు విడుద‌ల‌య్యాయి. అన్ని మంచి విజ‌యం సాధించాయి. సొంత బ్యాన‌ర్లోనే సుంద‌ర్ వాటిని స్వీయా ద‌ర్శ‌క‌త్వంలో నిర్మించి మంచి లాభాలు చూసారు. కోలీవుడ్ హారర్ థ్రిల్ల‌ర్ `ఆర‌ణ్మ‌ణై` అన్న‌ది ఇప్పుడో బ్రాండ్ గామారింది. ఆ ప్రాంచైజీకి ప్ర‌త్యేక‌మైన అభిమానులు ఏర్ప‌డ్డారు.

ఆ ప్రాంచైజీ నుంచి సినిమా వ‌స్తుందంటే? తెలుగు అభిమానుల్లోనూ ప్ర‌త్యేక‌మైన క్రేజ్ ఉంది. ఇటీవ‌ల రిలీజ్ అయిని `ఆర‌ణ్మ‌ణై -4` ఏకంగా 100 కోట్ల క్ల‌బ్ లోనే చేరింది. ఈనేప‌థ్యంలో `ఆర‌ణ్మ‌ణై -5` షూటింగ్ ప్రారంభ మైందంటూ నెట్టింట ప్ర‌చారం జ‌రుగుతోంది. దానికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ కూడా ఒక‌టి వైర‌ల్ అవుతోంది. అయితే ఈ విష‌యం సుంద‌ర్ భార్య న‌టి ఖుష్బూ దృష్టికి వెళ్ల‌డంతో ఆమె స్పందించారు.

ఈ వార్త‌ల‌న్ని అవాస్త‌వ‌మ‌ని ఖుష్బూ ఖండించారు. సినిమాకు సంబంధించి తాము ఎ లాంటి ప్ర‌క‌ట‌న‌గానీ, పోస్ట‌ర్ గానీ రిలీజ్ చేయ‌లేద‌న్నారు. ఐద‌వ భాగానికి సంబంధించి ఏ మీడియా హౌస్ తో నూ ఇంత‌వ‌ర‌కూ ఎక్క‌డా మాట్లాడ లేద‌న్నారు. త‌మ‌కు తెలియ‌కుండా ఈ వార్త ఎలా వ‌చ్చిందో అర్దం కావ‌డం లేద‌న్నారు. `ఆర‌ణ్మ‌నై 5`కి సంబంధించి ఎలాంటి ప్లానింగ్ చేసినా ముందుగా మీడియాకే విష‌యంచెబుతామ‌ని, అంత‌వ‌ర‌కూ సోష‌ల్ మీడియాలో వ‌చ్చే త‌ప్పుడు ప్ర‌చారాలు న‌మ్మోద్ద‌ని కోరారు.

దీంతో కోలీవుడ్ మీడియాలో జ‌రుగుతోన్న ప్ర‌చారమంతా ఫేక్ అని తేలిపోయింది. ప్ర‌స్తుతం సుంద‌ర్. సి `గ్యాంగ‌ర్స్` అనే సినిమా తెర‌కెక్కిస్తున్నాడు. ఇది ఆన్ సెట్స్ లో ఉంది. అలాగే `ముక్తై అమ్మ‌న్-2` అనే మ‌రో చిత్రాన్ని ప్ర‌క‌టిం చారు. అలాగే న‌టుడిగానూ మూడు , నాలుగు సినిమాలు చేస్తున్నారు. ఇలా సుంద‌ర్ ద‌ర్శ‌క‌, న‌టుడిగా రెండు పారితోషికాలు అందుకుంటున్నారు.

Tags:    

Similar News