సందీప్ కిషన్.. అందరికీ ఫస్ట్ అండ్ బెస్ట్ ఛాయిస్!

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ కు ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు ఉన్న విషయం తెలిసిందే. టాలెంటెడ్ హీరోస్ లిస్ట్ లో ఆయన పేరు కచ్చితంగా ఉంటుంది.

Update: 2025-02-04 06:52 GMT

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ కు ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు ఉన్న విషయం తెలిసిందే. టాలెంటెడ్ హీరోస్ లిస్ట్ లో ఆయన పేరు కచ్చితంగా ఉంటుంది. ప్రస్థానం మూవీతో ఇండస్ట్రీలోకి వచ్చిన ఆయన.. స్నేహగీతం చిత్రంతో హీరోగా మారారు. రొటీన్ లవ్ స్టోరీ సినిమాతో సోలో కథానాయకుడిగా తన కెరీర్ స్టార్ట్ చేశారు.

అప్పటి నుంచి వరుస సినిమాలు చేస్తూ సినీ ప్రియులను అలరిస్తున్నారు. తన యాక్టింగ్ తో మెప్పిస్తున్నారు. కొన్నాళ్లుగా తెలుగు చిత్రాల్లో యాక్ట్ చేస్తూనే.. మిగతా లాంగ్వేజ్ మూవీల్లో కూడా సందడి చేస్తున్నారు. గత ఏడాది వివిధ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన.. ఇప్పుడు మజాకా మూవీతో బిజీగా ఉన్నారు.

ధమాకా ఫేమ్ త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా.. ఫిబ్రవరి 21వ తేదీన రిలీజ్ కానుంది. అయితే ఇప్పటికే ఆ మూవీపై ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కూడా మంచి రెస్పాన్స్ అందుకుంది. దీంతో సినిమా హిట్ అవుతుందని అంతా అంచనా వేస్తున్నారు.

అయితే ఇప్పటికే ఊరిపేరు భైరవ కోనతో హిట్ కొట్టిన సందీప్.. ఇప్పుడు మజాకాతో కూడా మెప్పిస్తే ఆయన మార్కెట్ భారీగా పెరగడం ఖాయం. అదే సమయంలో సందీప్ కిషన్.. వివిధ ప్రాజెక్టులకు గాను ఫస్ట్ అండ్ బెస్ట్ ఛాయిస్ గా మారుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ సూపర్ సుబ్బు టైటిల్ తో తమ ఫస్ట్ తెలుగు వెబ్ సిరీస్ రూపొందిస్తున్న విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన టీజర్ ను రీసెంట్ గా రిలీజ్ చేయగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ సిరీస్ లో సందీప్ కిషన్ హీరోగా నటిస్తుండగా.. టీజర్ ఆడియన్స్ లో భారీ అంచనాలు క్రియేట్ చేసింది.

దళపతి విజయ్ కొడుకు జోసెఫ్ విజయ్ డైరెక్టర్ గా డెబ్యూ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలో హీరోగా సందీప్ కిషనే నటిస్తున్నారు. కొంత కాలం క్రితం.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ డెబ్యూ మూవీ హీరో సందీప్ కిషనే. మొత్తానికి ఒక మిడ్ రేంజ్ హీరో.. సినీ ఇండస్ట్రీలో ఫస్ట్ అండ్ బెస్ట్ ఆప్షన్ గా మారడం గమనించాల్సిన విషయం. అలా సందీప్ కిషన్.. తన టాలెంట్ తో వేరే లెవెల్ లో దూసుకుపోతున్నారనే చెప్పాలి.

Full View
Tags:    

Similar News