ఔను.. ఆ సినిమా నాకూ నచ్చలేదు
యంగ్ హీరో సందీప్ కిషన్ గత చిత్రం మైఖేల్ బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశ పరిచింది. తెలుగు తో పాటు తమిళంలో కచ్చితంగా హిట్ అవుతుందని భావించారు.
యంగ్ హీరో సందీప్ కిషన్ గత చిత్రం మైఖేల్ బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశ పరిచింది. తెలుగు తో పాటు తమిళంలో కచ్చితంగా హిట్ అవుతుందని భావించారు. కానీ అక్కడ ఇక్కడ కూడా సినిమా ఫ్లాప్ అయ్యింది. సందీప్ కెరీర్ లో అత్యంత ఖరీదైన ఫ్లాప్ మూవీగా మైఖేల్ నిలిచింది.
ఇక సందీప్ త్వరలో ఊరు పేరు భైరవకోన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే ఆ సినిమాకు పాజిటివ్ బజ్ క్రియేట్ చేయడంలో యూనిట్ సభ్యులు సఫలం అయ్యారు. అంతే కాకుండా సినిమాలోని ఒక పాట హిట్ అవ్వడంతో సినిమా గురించి జనాల్లో చర్చ జరుగుతోంది.
ఊరు పేరు భైరవకోన ప్రమోషన్ లో భాగంగా మాట్లాడుతూ తన గత చిత్రం మైఖేల్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. సందీప్ కిషన్ మాట్లాడుతూ... మైఖేల్ థియేటర్లలో సరిగ్గా ఆడలేదు. కమర్షియల్ విషయాలు పక్కన పెడితే సినిమా ఫైనల్ వర్షన్ నాకు కూడా నచ్చలేదు.
సినిమా విడుదలకు కొన్ని రోజుల ముందు నిర్మాతల్లో ఒకరు సినిమా బాగాలేదు అన్నారు. అప్పుడు నేను ఏం చేయలేక పోయాను. సినిమా విడుదలకు ముందు రోజు నేను థియేటర్ లో చూశాను. అప్పుడే నాకు అర్థం అయ్యింది. సినిమా కోసం మేము మంచి కంటెంట్ ను తీశాం. కానీ ఎడిటింగ్ విషయంలో తప్పు జరిగిందనే అభిప్రాయం వ్యక్తం చేశాడు.
సినిమా లోని మొదట కొన్ని సన్నివేశాల చిత్రీకరణ తర్వాత చూస్తే కచ్చితంగా మంచి సినిమా అవుతుంది అనిపించింది. కానీ తీరా సినిమా ఫైనల్ వర్షన్ లో మాత్రం సినిమా నిరాశ పరిచింది అంటూ నిర్మొహమాటంగా సందీప్ కిషన్ పేర్కొన్నాడు.