రియల్ లైఫ్ లోనే కాదు..రీల్ లైఫ్ లోనూ అలా!
చారిత్రాత్మక కథాశం కావడం సహ భారీ తారాగణం తో తెరకెక్కడంతో అంచనాలు భారీగా ఏర్పడు తున్నాయి.
రియల్ లైఫ్ లో తండ్రీకొడుకులు..రీల్ లైఫ్ లో కూడా తండ్రీకొడుకులు కాబోతున్నారా? ఇద్దరి వాస్తవ జీవితాలకు ఆ రెండు పాత్రలు దగ్గరగా ఉండబోతున్నాయా? అంటే అవుననే తెలుస్తోంది. ఇంతకీ ఎవరా ఫాదర్ సన్? అంటే అసలు వివరాల్లోకి వెళ్లాల్సిందే. రాజ్ కుమార్ సంతోషి భారీ కాన్సాస్ పై `లాహోర్ 1947` చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అమీర్ ఖాన్..సన్ని డియోల్..ప్రీతీ జింటా ప్రధాన పాత్రల్లో ఈ సినిమా రూపొందుతుంది.
చారిత్రాత్మక కథాశం కావడం సహ భారీ తారాగణం తో తెరకెక్కడంతో అంచనాలు భారీగా ఏర్పడు తున్నాయి. తాజాగా ఈ ప్రాజెక్ట్ లోకి సన్ని డియోల్ కుమారుడు కరణ్ డియోల్ కూడా చేరాడు. ఓ కీలక పాత్రకు కరణ్ ని ఎంపిక చేసారుట. దీంతో ఈ ప్రాజెక్ట్ కి కొత్త కళ వచ్చినట్లు అయింది. నిజ జీవితంలో సన్నిడియోల్-కరణ్ డియెల్ తండ్రీకొడుకులు. ఇప్పుడు తెర మీదనా మరోసారి తండ్రీకొడుకుల పాత్రలు పోషించడానికి రెడీ అవుతున్నారు.
ఈ రెండు పాత్రలు వాళ్ల వ్యక్తిగత జీవితానికి కొంతవరకూ కనెక్ట్ కూడా అవుతున్నాయట. దీంతో ప్రాజెక్ట్ కి ఇది అదనపు ఆకర్షణ అనుకోవచ్చు. ఇంతవరకూ ఇద్దరు ఇలాంటి పాత్రలు పోషించింది లేదు. కరణ్ డియోల్ కి నటుడిగా ఇది మూడవ సినిమా. `పాల్ పాల్ దిల్ కే పాస్` తో బాలీవుడ్ లో తెరంగేట్రం చేసాడు. ఆ తర్వాత `వెల్లె` అనే చిత్రంలో నటించాడు. కానీ అటుపై అవకాశాలు రాలేదు. నటుడిగా ఎదిగే దశలో ఉన్నాడు.
సరిగ్గా ఇదే సమయంలో ప్రతిష్టాత్మక చిత్రంలో ఏకంగా తండ్రితో కలిసి నటించే అవకాశం ఒక ఎత్తైతే?... అదే తండ్రికి కొడుకు నటించడం మరో ఎత్తు. నటుడిగా షైన్ అవ్వడానికి ఈ సినిమా మరింత కలిసొ స్తుందని చెప్పొచ్చు. సినిమా సక్సెస్ అయితే బాలీవుడ్ లో అవకాశాలు పెరగడానికి ఛాన్స్ ఉంది. `గదర్ 2` విజయంతో సన్ని డియోల్ మళ్లీ బిజీ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మూడు-నాలుగు సినిమాలు చేస్తున్నాడు.