సెల్ ఫోన్ వల్ల మహేశ్ కు ఆ సమస్య వస్తోందట

తాజాగా ఓ సెల్ ఫోన్ సంస్థ 20 ఇయర్స్ వేడుకలో పాల్గొన్న ఆయన పలు విషయాలను పంచుకున్నారు

Update: 2023-08-21 11:11 GMT

సెల్ ఫోన్ ప్రస్తుతం ప్రతిఒక్కరి జీవినశైలిలో భాగం అయిపోయింది. నిద్ర లేవడం మొదలు పడుకునే వరకు ఈ పరికరం మనం చేతిలో ఉండాల్సిందే. అప్పుడే మన పనులు సులువుగా అవుతాయి. అయితే ఇది ఎక్కువగా వాడటం వల్ల ఎన్నో నష్లాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. కానీ వాడకుండా ఉండలేము. అయితే తాజాగా ఫోన్ వినియోగంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు.

తాజాగా ఓ సెల్ ఫోన్ సంస్థ 20 ఇయర్స్ వేడుకలో పాల్గొన్న ఆయన పలు విషయాలను పంచుకున్నారు. అందులో భాగంగానే.. తన ఫోన్ రింగ్ టోన్ ఏంటి అని ఓ మీడియా ప్రతినిధి అడగగా.. తన ఫోన్ రింగ్ టోన్ సైలెంట్ అని ఫన్నీగా బదులిచ్చారు. దీంతో అక్కడ ఉన్నవారు టక్కున నవ్వేశారు. షూటింగ్స్ తో బిజీగా ఉండటం వల్ల తన ఫోన్ ఎప్పుడు సైలెంట్ లోనే ఉంటుందని చెప్పారు.

మీ అందరిలానే నేనూ స్మార్ట్ ఫోన్‌ ఎక్కువగానే వినియోగిస్తాను. అప్పుడప్పుడు తలనొప్పి కూడా వస్తుంటుంది. దాన్ని ఆపేయడానికి ట్రై చేస్తాను. పడుకునేటప్పుడు, లేవగానే ఫోన్‌ చూడడం, ఉపోయోగించడం నాకూ అలవాటే. కానీ సాయంత్రం 6.30 తర్వాత దానికి దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తు న్నాను. అని అన్నారు.. ఇక తన పిల్లలకు ఫోన్ ఇచ్చే విషయంపై మాట్లాడుతూ.. నా పిల్లలకు స్మార్ట ఫోన్ ఇవ్వలేదు. వాళ్లే తీసేసుకున్నారు. అని నవ్వించారు.

దీంతో పాటే తన కొత్త సినిమా గుంటూరు కారం రిలీజ్ పై కూడా స్పష్టతనిచ్చారు మహేశ్. సంక్రాంతికి సినిమా ఖచ్చితంగా విడుదల అవుతుందని తెలిపారు. అలాగే షూటింగ్‌లు లేనప్పుడు ఫ్యామిలీతో కలిసి టూర్స్ కు వెళ్తుంటానని, పిల్లలతో గడపడమంటే ఇష్టమని చెప్పారు. గౌతం పుట్టినప్పటి నుంచి సేవా కార్యక్రమాలపై ఎక్కువ దృష్టి పెట్టినట్లు తెలిపారు. తన సినిమాలు రీరిలీజ్‌పై వచ్చే మొత్తాన్ని చిన్నారుల సంక్షేమానికి, స్వచ్ఛంద సంస్థకు ఇస్తున్నట్లు తెలిపారు.

కాగా, ప్రస్తుతం మహేశ్ నటిస్తున్న గుంటూరు కారం సినిమాకు త్రివిక్రమ్‌ తెరకెక్కిస్తున్నారు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ బ్యానర్ పై రూపొందుతోంది. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్. చాలా రోజుల కిందటే షూటింగ్ ప్రారంభించుకున్న ఈ చిత్రం షూటింగ్ విషయంలో సమస్యలను ఎదుర్కొంటూ ముందుకెళ్తోంది. అతడు, ఖలేజా తర్వాత మహేశ్‌బాబు - త్రివిక్రమ్‌ కాంబోలో ఈ చిత్రం వస్తుండటం వల్ల సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.

Tags:    

Similar News