తలైవా.. ఆ క్రేజ్ ఎక్కడ సామీ?
ఇక తమిళనాడు పరిస్థితి అలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో అసలు తలైవా సినిమాలకు ఏమాత్రం బజ్ కాదు కదా సరైన ఓపెనింగ్స్ కూడా రావడం లేదు.
సౌత్ సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా ఇండియన్ సినిమా హిస్టరీ మొత్తంలో కూడా భాషతో సంబంధం లేకుండా అత్యధిక స్థాయిలో క్రేజ్ అందుకున్న అతిపెద్ద మంది నటుల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ ఒకరు. ముఖ్యంగా సౌత్ ఇండస్ట్రీలో అయితే తలైవా సినిమా వస్తోంది అంటేనే మిగతా పెద్ద సినిమాలు కూడా వాయిదా పడిన సందర్భాలు ఉన్నాయి. ఇక దానికి తోడు ఫ్యాన్స్ కూడా ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచి సాంగ్స్ వరకు చాలా హడావిడి చేస్తూ కనిపించేవారు కానీ ఈసారి జైలర్ సినిమా విషయానికి వస్తే వాతావరణం అందుకు భిన్నంగానే కనిపిస్తోంది.
రోబో సినిమా వరకు కూడా రజనీకాంత్ సినిమాలకు ఒక రేంజ్ లో అయితే హైప్ ఉండేది. కానీ ఆ తర్వాత ఆయన సినిమాల రేంజ్ అయితే మెల్లగా తగ్గుతూ వస్తోంది. అందుకు ముఖ్య కారణం రజినీకాంత్ స్టార్ క్రేజ్ కు తగ్గట్టుగా ఏ దర్శకుడు కూడా అభిమానుల అంచనాలను అందుకోలేకపోతున్నారు. ఎలాంటి సినిమా చేసిన కూడా బాక్సాఫీస్ వద్ద ఎక్కడో ఒక చోట అయితే దారుణంగా నష్టాలు కలగజేస్తోంది.
2010లో రోబో సినిమా తర్వాత రజనీకాంత్ కు సరైన సక్సెస్ అయితే పడలేదు. లింగ, కబాలి, కాల , 2.0, పేట, దర్బార్ అన్నతై ఇలా వరుసగా విన్నమైనా తరహాలో సినిమాలు చేశారు. కానీ ఏవి కూడా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో అయితే సక్సెస్ కాలేకపోయాయి. అందులో మరికొన్ని దారుణంగా డిజాస్టర్ కూడా అయ్యాయి.
ఇక ఇప్పుడు యువ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో చేస్తున్న జైలర్ సినిమాకు అయితే అనుకున్నంత స్థాయిలో బజ్ అయితే క్రియేట్ కాలేదు. తమిళనాడులో రజనీకాంత్ సినిమా వస్తోంది అంటే ఉదయం నాలుగు గంటలకే షోలు ప్రారంభమయ్యేవి. కానీ ఇప్పుడు ఆ విషయంలో అసలు క్లారిటీ లేని పరిస్థితి ఏర్పడింది. బిజినెస్ లేకపోవడంతో డిస్ట్రిబ్యూటర్స్ కూడా పెద్దగా ఆసక్తిని చూపించడం లేదు అనే టాక్ వస్తోంది.
అయితే ఫ్యాన్స్ మాత్రం ఉదయం 4 గంటలకు షోలు పడాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఆ విషయంలో చిత్ర నిర్మాతలు ఆలోచిస్తున్నారు. కానీ ఇంకా బెనిఫిట్ షోల గురించి అయితే ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. సినిమా విడుదల కావడానికి ఇంకా పది రోజుల సమయం మాత్రమే ఉంది. ఇక తమిళనాడు పరిస్థితి అలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో అసలు తలైవా సినిమాలకు ఏమాత్రం బజ్ కాదు కదా సరైన ఓపెనింగ్స్ కూడా రావడం లేదు.
అంతేకాకుండా కొన్ని సినిమాలు పండగలకు వచ్చినా కూడా డిస్ట్రిబ్యూటర్స్ కు పెద్దగా ప్రాఫిట్స్ అయితే అందించింది లేదు. ఇక ఇప్పుడు జైలర్ సినిమా కూడా అనుకున్నంత స్థాయిలో పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే క్రియేట్ చేయడం లేదు. కంటెంట్ పరంగా బాగానే ఉందని అనిపిస్తుంది కానీ ఎందుకో సినిమాపై అంచనాలు పెరగడం లేదు. అందుకు మరొక కారణం కూడా ఉంది. తెలుగులో బీస్ట్ సినిమా విడుదలైనప్పుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెలుగు ఫ్యాన్స్ ను చాలా నిరాశపరిచాడు. అసలు ఆ సినిమా తెలుగులో ఏ మాత్రం ఆకట్టుకోలేదు ఆ దెబ్బ కూడా జైలర్ పై ప్రభావం చూపించినట్లు తెలుస్తోంది.