వీడియో: హీరామండి కాస్ట్యూమ్‌లో సురేఖావాణి కుమార్తె హొయలు
తాజాగా సుప్రీత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫోటోలు, వీడియో అభిమానుల్లో సంచలనం సృష్టించాయి
సోషల్ మీడియాల్లో చురుకైన అమ్మాయి సుప్రీత నాయుడు. ఈ యంగ్ బ్యూటీ వ్యక్తిగత జీవితంలోని ఆసక్తికర విషయాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ అభిమానులకు నిరంతరం టచ్‌లో ఉంటుంది. సుప్రీత ఫ్యాషన్ సెన్స్ యువతరంలో స్ఫూర్తిని నింపుతుంది.
తాజాగా సుప్రీత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫోటోలు, వీడియో అభిమానుల్లో సంచలనం సృష్టించాయి. ఈ ఫోటోలలో లైట్ మేకప్ తో సొగసైన నీలిరంగు పూల లెహంగా ధరించి కనిపించింది. తాజా వీడియోలో సొగసైన చిరునవ్వుతో కెమెరా ముందు పోజులిచ్చింది. సుప్రీత ఈ పోస్ట్‌కు అందమైన క్యాప్షన్ ఇచ్చింది ''ఆమె రాణి! ఆమె ఆత్మ రాయల్టీ!'' అని వ్యాఖ్యను జోడించారు.
ఈ యంగ్ బ్యూటీ లుక్‌కి అభిమానులు ఫిదా అయ్యారు. చాలా మంది నెటిజనులు హృదయాలకు ఒక రకంగా గాయమైంది. లవ్ ఎమోజీలతో కుర్రాళ్లు తమ ప్రేమను కురిపించారు. ఇదే వేషధారణతో ఉన్న ఓ వీడియోను కూడా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. వీడియోలో సుప్రీత అందమైన రూపం ఒక కవ్వింత. లెహంగా ధరించి ఎంతో స్టైలిష్ గా ఫోజులిచ్చింది. అంతేకాదు.. తన ముక్కుకు ఉన్న ఆ ప్రత్యేకమైన ముక్కెరను చూడగానే హీరామండిలో అదితీరావ్ ని తలపించిందంటూ అభిమానులు కితాబిచ్చేస్తున్నారు. దానికి అనుగుణంగానే హీరామండి నుంచి క్లాసిక్ సాంగ్ ని బ్యాక్ గ్రౌండ్ లో ఉపయోగించారు. ఈ పోస్ట్‌కి 'మీకు మీరే కిరీటం ధరించండి' అనే ట్యాగ్ ని సుప్రీత జోడించింది.
ఈ ఫోటో షూట్ బ్రాండ్ ఎండార్స్మెంట్లో భాగమని స్పష్టంగా తెలుస్తుంది. ఈ దుస్తులను ప్రఖ్యాత డిజైనర్ స్టూడియో స్పాన్సర్ చేయగా, హెయిర్ స్టైలింగ్ కోసం మరో ప్రతిభావని పని చేసారు. ఇటీవలే బీచ్ పరిసరాల్లో నిలబడి చేతిలో వైన్ గ్లాస్‌తో పోజులిచ్చిన సుప్రీత ఫోటోలు వైరల్ అయ్యాయి. ఈ ఫోటో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో 55 వేలకు పైగా లైక్‌లను సంపాదించింది.
సుప్రీత నాయుడు ప్రముఖ తెలుగు నటి సురేఖ వాణి కుమార్తె. సురేఖ ఆరడుగుల బుల్లెట్లు (గోపిచంద్) లో నటించింది. అలాగే శ్రవణ్ రెడ్డి, రుహాని శర్మలతో కలిసి `డర్టీ హరి`లోను పని చేసింది. ఈ చిత్రం యంగ్ ట్యాలెంట్‌కు మంచి పేరు తెచ్చింది. ఇటీవల సోషల్ మీడియాల్లోను సుప్రీతకు భారీగా ఫాలోయింగ్ పెరిగింది.