బిగ్ బాస్ 7లో తల్లి కూతురు.. ఈసారి ఏమంటారో..

సీనియర్ నటి సురేఖ వాణి పేరు వినపడుతోంది. అయితే, ఇప్పటి వరకు సురేఖ వాణి, ఆమె కుమార్తె సుప్రిత పేర్లు చాలా సార్లు వినిపించాయి

Update: 2023-08-09 02:30 GMT

ప్రముఖ టీవీ రియాల్టీ షో బిగ్ బాస్ కి దేశ వ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ ఉంది. హిందీలో బాగా క్లిక్ అయిన ఈ షోని తెలుగులోనూ తీసుకువచ్చారు. తెలుగులోనూ ఈ షో బాగా క్లిక్ అయ్యింది. ఇప్పటి వరకు బిగ్ బాస్ తెలుగులో ఆరు సీజన్లు పూర్తి చేసుకుంది. ఏడో సీజన్ కూడా మొదలవ్వడానికి రెడీ అవుతుంది. షో సెప్టెంబర్ లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

అయితే, షో మొదలుకాకముందే, వీరే ఈ సారి షోలో సందడి చేసేది అంటూ కొందరి పేర్లు వినపడుతున్నాయి. అలా వినిపించే పేర్లలో సీనియర్ నటి సురేఖ వాణి పేరు వినపడుతోంది. అయితే, ఇప్పటి వరకు సురేఖ వాణి, ఆమె కుమార్తె సుప్రిత పేర్లు చాలా సార్లు వినిపించాయి. అయితే, చాలా సార్లు తాము బిగ్ బాస్ లో పాల్గొనడం లేదు అంటూ వారు క్లారిటీ ఇచ్చారు. అయితే, ఈసారి బిగ్ బాస్ 7వ సీజన్ లోనూ వీరు పాల్గొంటారంటూ మళ్లీ వార్తలు వస్తున్నాయి.

మరి, వీరు ఈ సీజన్ అయినా సందడి చేస్తారో లేదో చూడాలి. ఇదిలా ఉండగా, ఈసారి బిగ్ బాస్ టీమ్ మరింత ఆసక్తిగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. మొదటి ఐదు సీజన్లు బాగానే క్లిక్ అయ్యాయి. కానీ, ఆరో సీజన్ ప్లాప్ అయిపోయింది. నెట్టింట ఈ సీజన్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో, ఈ సారి అలా జరకుండా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. అంతేకాకుండా, ప్రతి సీజన్ లో ముందుగా వెళ్లిన కంటెస్టెంట్స్ తో పాటు, వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ఉంటుంది. కానీ, ఈ సారి మాత్రం అలా వైల్డ్ కార్డు అనే కాన్సెప్ట్ లేకుండా చేస్తున్నారట.

అంతేకాకుండా, టాస్క్ లు గతంలోవి రిపీట్ కాకుండా, ఈ సారి కొత్తగా ఉండేలా డిజైన్ చేస్తున్నారట. ఇక, ఈ సీజన్ లో చాలా మంది ఇంట్రస్టింగ్ పర్సన్స్ ని తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. ఈటీవీ ప్రభాకర్, యూట్యూబ్ ఫేమ్ యాంకర్ నిఖిల్, సింగర్ మోహన భోగరాజు, ఢీ కొరియోగ్రాఫర్ పండు, టిక్ టాక్ ఫేమ్ దుర్గారావు ఆయన భార్య కూడా వస్తున్నారట. మరి కొందరి పేర్లు కూడా వినపడుతున్నాయి. అంతేకాకుండా, ఈ సారి గ్లామర్ డోస్ ఎక్కువగా పెంచాలని చూస్తున్నారట. అంటే, ఈ సీజన్ లో అందమైన అమ్మాయిలు ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది.

షో మొదలైతే తప్ప, ఎవరెవరు వస్తారు అనే విషయం తేలనుంది. ఇక, బిగ్ బాస్ ఓటీటీలో సందడి చేసిన కొందరు సైతం మళ్లీ ఈ బిగ్ బాస్ 7లో కనిపించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సీజన్ సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ప్రసారం అయ్యే అవకాశం ఉంది.

Tags:    

Similar News