సూర్య-జ్యోతిక లవ్ స్టోరీ వెరీ బోరింగ్!
సూర్య-జ్యోతికలు ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ దంపతులకు దియా-దేవ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.
సూర్య-జ్యోతికలు ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ దంపతులకు దియా-దేవ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వృత్తి-వ్యక్తిగత జీవితంలో ఇద్దరు ఎంతో సంతోషంగా ముందుకు సాగిపోతున్నారు. ఇటీవలే చెన్నై నుంచి ముంబైకి షిప్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇక జ్యోతిక సెకెండ్ ఇన్నింగ్స్ లోనూ దూసుకుపోతున్నారు. ఓవైపు ఇంటి ఇల్లాలుగా బాధ్యతలు నెరవేరుస్తూనే....నటిగా కొనసాగుతున్నారు. ఫిట్ నెస్ పైనా దృష్టి పెట్టి ఫిట్ నెస్ ప్రీక్ అనిపిస్తున్నారు ఈ మధ్య కాలంలో.
తాజాగా సూర్యతో జ్యోతిక లవ్ స్టోరీ చాలా బోరింగ్ అనేసింది. అవును ఈ విషయం స్వయంగా జ్యోతిక రివీల్ చేసింది. తమ జీవితాల్లో అత్యంత బోరింగ్ విషయాల్లో లవ్ కూడా ఒకటి అని అన్నారు. సూర్యను ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో జ్యోతిక వివరించింది.` సూర్యను నేను పెళ్లి చేసుకోవడానికి అతడు నాకు ఇచ్చిన గౌరవమే ప్రధాన కారణం. మేము తొలిసారి పూవెల్లమ్ కెట్టుప్పర్ అనే సినిమాలో కలిసి నటించాం.
నాతో చాలా క్యాజువల్ గా మాట్లాడాడు. ఆ తర్వాత ఏడు సినిమాల్లో కలిసి నటించాం. ఎవరైనా డైరెక్టర్ ఓ రొమాంటిక్ సీన్ వివరించినప్పుడు సూర్య అంత వరకే నటించేవాడు. దానిని అదునుగా తీసుకునేవాడు కాదు. ఆ గౌరవమే నన్ను ఆకర్షించింది. ఇక నేను అప్పటికే 10 ఏళ్ల పాటు షూటింగ్ లలో 9 నుంచి 6 వరకూ పని చేసీ చేసీ అలసిపోయాను. నాకు అవసరమైనంత డబ్బు అప్పటికే సంపాదించేశాను. ఆ సమయంలోనే సూర్య నాకు ప్రపోజ్ చేశాడు.
నా కుటుంబం కూడా అంగీకరించింది. దీంతో మరీ ఎక్కువగా ఆలోచించకుండా ఆ తర్వాతి నెలలోనే పెళ్లి చేసుకున్నాం. ప్రేమ పక్షుల్లా ఎక్కువ కాలం ఎదురు చూడలేదు. బయట పెద్దగా కలిసింది..తిరిగతింది కూడా లేదు. అందుకే మా లవ్ స్టోరీ మాకే బోరింగ్ గా అనిపిస్తుంది` అని అన్నారు.