డిసెంబర్ నుంచి బరిలోకి..ఇదేం స్పీడ్!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య బ్యాక్ టూ బ్యాక్ రిలీజ్ లు ప్లాన్ చేసాడా? ఆ దిశగానే అతడి అడుగులు పడుతున్నాయా? అలాగే కనిపిస్తోంది సన్నివేశం
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య బ్యాక్ టూ బ్యాక్ రిలీజ్ లు ప్లాన్ చేసాడా? ఆ దిశగానే అతడి అడుగులు పడుతున్నాయా? అలాగే కనిపిస్తోంది సన్నివేశం. ఇప్పటికే 43వ చిత్రం `కంగువ` షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం ఆసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఇది నవంబర్ లో రిలీజ్ అవుతుంది. ఈ సినిమా సెట్స్ లో ఉండగానే కార్తీక్ సుబ్బరాజ్ తో44వ చిత్రాన్ని లాక్ చేసారు. ఆ సినిమా షూటింగ్ కూడా తాజాగా పూర్తయింది. ఈనేపథ్యంలో 45వ చిత్రం షూటింగ్ కూడా షురూ అవుతుంది.
ఈసినిమా సెట్స్‌లో ఉండగానే ఆర్ జె బాలాజీని లైన్ లోకి తెచ్చి స్టోరీ లాక్ చేసాడు. ఇప్పుడా సినిమా షూటింగ్ డిసెంబర్ నుంచి మొదలవుతుంది. ప్రస్తుతం ఆ సినిమాకి సంబంధించిన లొకేషన్ల వేట కొనసాగుతుంది. సూర్యలో ఈ స్పీడ్ చూసి అంతా షాక్ అవుతున్నారు. సాధారణంగా కంగువా లాంటి వార్ సినిమా చేసిన తర్వాత వెంటనే మరో సినిమా షూటింగ్ లో పాల్గొనడం అంటే చిన్న విషయం కాదు. అప్పటికే బాగా అలిసిపోయి ఉంటారు. వార్ సన్నివేశాల్లో నటించి ఒళ్లు హూనమైపోయి ఉంటుంది.
దీంతో కనీసం ఆరు నెలలైనా విశ్రాంతి తీసుకోవాలని హీరోలు భావిస్తుంటారు. కొన్ని రోజుల పాటు విదేశాలకు వెకేషన్ కి వెళ్లిపోతుంటారు. కానీ సూర్య మాత్రం నో వెకేషన్ అంటూ అదే లోడింగ్ కొనసాగిస్తున్నాడు. 43 తర్వాత...44..దీని తర్వాత 45 అంటూ ఇప్పుడు మరో సినిమా షూట్‌కి రెడీ అవుతున్నాడు. కంగువ నవంబర్ లో రిలీజ్ అయితే? 44వ చిత్రాన్ని పొంగల్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తెచ్చేస్తారు. అటుపై సమ్మర్ కి మరో రిలీజ్ ను ప్లాన్ చేసుకుంటారు. ఆ రకంగా కొత్త ఏడాది లో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలో సూర్య ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశం ఉంది.
సూర్య పనిచేసిన దర్శకులంతా మంచి సక్సెస్ రేట్ ఉన్న వారే. 45వ సినిమా పూర్తియన తర్వాత వెట్రీ మారన్ తో 46వ చిత్రం ఉంటుంది. అదే ఏడాది బాలీవుడ్ చిత్రం కర్ణని కూడా సెట్స్ కి తీసుకెళ్తారు. ఈ చిత్రాన్ని 500 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.