ఇదేదో సూర్య పుష్పలా కొడుతుందే..?

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన 44వ సినిమాను కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్ లో ఫిక్స్ చేసుకున్నాడు

Update: 2024-06-07 13:12 GMT

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన 44వ సినిమాను కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్ లో ఫిక్స్ చేసుకున్నాడు. మొన్నటిదాకా కమర్షియల్ సినిమాలకు కాస్త దూరంగా కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ వచ్చిన సూర్య ఇప్పుడు పూర్తిగా కమర్షియల్ అంశాలున్న కథలనే ఓకే చేస్తున్నాడు. ప్రస్తుతం రిలీజ్ కు రెడీ అవుతున్న కంగువ సినిమా కూడా సూర్య నట విశ్వరూపంతో చెలరేగిపోతాడని టాక్. ఆ సినిమా రిలీజ్ అవ్వకుండానే సూర్య 44 సినిమాతో సర్ ప్రైజ్ చేస్తున్నాడు.

తమిళ యువ దర్శకులలో కార్తీక్ సుబ్బరాజు స్టైల్ వేరుగా ఉంటుంది. జిగర్ తండా డబుల్ ఎక్స్ తో లాస్ట్ ఇయర్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన కార్తీక్ సుబ్బరాజు ఈసారి సూర్యతో మరో కొత్త కథతో వస్తున్నాడు. ఐతే ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ చూస్తే ఇదేదో సూర్య మార్క్ పుష్ప సినిమాలా అనిపిస్తుంది. జులపాల జుట్టుతో సూర్య స్టైలిష్ లుక్ తో అదరగొడుతున్నాడు.

సూర్య 44 లుక్ చూసి ఇది సూర్య నుంచి వస్తున్న పుష్ప సినిమా అనేస్తున్నారు. అఫ్కోర్స్ ఒక్క లుక్కు చూసి చెప్పడం కరెక్ట్ కాదు. అదీగాక పుష్ప సినిమాలో పుష్ప రాజ్ అదే అల్లు అర్జున్ ఇంకా మాస్ లుక్ తో కనిపించాడు. ఐతే సూర్య 44 లో సూర్య లుక్ పుష్ప కాదు కానీ వింటేజ్ సూర్య ని తలపిస్తుందని అంటున్నారు. సూర్య సన్నాఫ్ కృష్ణన్ ఇంకా చాలా సినిమాల్లో సూర్య ఇలా యంగ్ లుక్ లో లాంగ్ హెయిర్ తో కనిపించాడు.

Read more!

మళ్లీ సూర్య ఆ తరహా కథతో వస్తున్నాడని అంటున్నారు. ఏది ఏమైనా సూర్య 44 నిజంగానే కోలీవుడ్ ఆడియన్స్ కి సూపర్ కిక్ ఇచ్చేలా ఉంది. ఈ సినిమా మూమెంట్ చూస్తుంటే పాన్ ఇండియా రిలీజ్ చేసేలా ఉన్నారు. సో సూర్య కంగువ తర్వాత ఈ సినిమాతో నేషనల్ లెవెల్ లో ఆడియన్స్ ని అలరించనున్నాడు సూర్య. సూర్య 44 వ సినిమాను సూర్య సొంత బ్యానర్ ఐన 2డి ఎంటర్టైన్మెంట్స్ తో పాటుగా స్టోన్ బెంచ్ ఫిలింస్ కలిసి నిర్మిస్తున్నారు. సూర్య కంటెంట్ హిట్ పక్కా అనుకున్న కథనే ప్రొడ్యూస్ చేస్తారు కాబట్టి సూర్య 44 పక్కా హిట్ టార్గెట్ తో వస్తుందని చెప్పొచ్చు.

Tags:    

Similar News