ఇండియన్ 2.. సూర్య ఇంటి కోసం అన్ని కోట్లా?

ఎన్ని కోట్లు ఖర్చు అయిన కూడా కచ్చితంగా ఆయన అనుకున్న సెట్స్ లోనే షూట్ చేస్తారు.

Update: 2024-08-20 16:54 GMT

శంకర్ సినిమాలు అంటేనే ఎక్కువ గ్రాండియర్ కనిపిస్తుంది. సాంగ్స్ కోసం కూడా శంకర్ ఎవ్వరూ ఊహించని విధంగా సెట్స్ వేస్తారు. అలాగే కీలకమైన సన్నివేశాలు, మెయిన్ లీడ్ యాక్టర్స్ ఉండే హౌస్ ల కోసం కూడా సెట్స్ వేయిస్తారు. ఈ విషయంలో శంకర్ ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వరు. ఎన్ని కోట్లు ఖర్చు అయిన కూడా కచ్చితంగా ఆయన అనుకున్న సెట్స్ లోనే షూట్ చేస్తారు. అందుకే శంకర్ సినిమాలకి భారీ బడ్జెట్ అవుతుంది.

అయితే ఆయన సినిమాలు చూస్తున్నప్పుడు కొన్ని సన్నివేశాలకి ఈ స్థాయిలో సెట్ వర్క్ అవసరం లేదు కదా అనిపిస్తుంది. ఇతర దర్శకులతో తనని వేరు చేసేది ఈ లావిస్, గ్రాండియర్ ప్రెజెంటేషన్ అని ఆయన బలంగా నమ్ముతారంట. ఇదిలా ఉంటే తాజా శంకర్ నుంచి ఇండియన్ 2 మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇండియన్ 2,3 పార్ట్స్ కి కలిపి 500 కోట్ల వరకు బడ్జెట్ అయినట్లు తెలుస్తోంది.

ఈ స్థాయిలో బడ్జెట్ ఖర్చు పెట్టి తీసిన సినిమా ఇంకెంత అద్భుతంగా ఉంటుందో అని చూడాలనే క్యూరియాసిటీ అందరిలో నెలకొంది. అయితే ఇండియన్ 2 మూవీ మొదటి రోజు మొదటి ఆటకే ప్రేక్షకుల నుంచి తిరస్కరణకి గురైంది. ఈ సినిమాలో అనవసరమైన సన్నివేశాలు, చాలా ఉన్నాయని ప్రేక్షకుల నుంచి నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. అవసరం లేని చోట కూడా శంకర్ నిర్మాతలతో భారీగా ఖర్చు పెట్టించారు. ఇందులో చనిపోయిన ముగ్గురు యాక్టర్స్ ని AI తో క్రియేట్ చేశారు.

ఆ పాత్రలకి కథలో గొప్ప ప్రాధాన్యత ఉందా అంటే లేదనే చెప్పాలి. అలాగే సినిమాలో మెయిన్ విలన్ గా నటించిన ఎస్.జె. సూర్య ఇంటిని అయితే ఏకంగా 8 కోట్ల రూపాయలతో నిర్మించారంట. ఈ విషయాన్ని తాజాగా సూర్య ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఎస్.జె.సూర్య విలన్ గా నటించిన సరిపోదా శనివారం మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సినిమా తమిళ్ ప్రమోషన్స్ లో సూర్య పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఇండియన్ 2లో తన క్యారెక్టర్ గురించి మాట్లాడారు. ఆ సినిమాలో తాను ఉండే ఇంటి కోసం 8 కోట్లు ఖర్చు చేశారని, అలాగే ఇంటీరియర్ డిజైన్ వర్క్స్, లైటింగ్స్ కలిస్తే ఇంకా ఎక్కువ మొత్తం అవుతుందని తెలిపారు. ఆర్ట్ డైరెక్టర్ రవి వర్మన్ ఇంటిని చాలా బాగా డిజైన్ చేశారని అన్నారు. అయితే సినిమాలో సూర్య క్యారెక్టర్ కి అంత ప్రాధాన్యత లేనట్లు అనిపిస్తుంది. అయిన భారీగా ఖర్చు పెట్టి మరీ ఇంటి సెట్ వేయాల్సిన అవసరం లేదనే అభిప్రాయంలో సూర్య మాట్లాడినట్లు టాక్ వినిపిస్తోంది.

సినిమాలో ఇలాంటి హెవీగా ఖర్చయిన సెట్ వర్క్స్ మరో 20 వరకు ఇండియన్ 2లో ఉన్నాయంట. ఈ కారణంగానే సినిమాకి భారీగా ఖర్చు అయినట్లు తెలుస్తోంది. ఈ స్థాయిలో శంకర్ ఇండియన్ 2 కోసం ఖర్చు చేసిన ఆ ఖర్చుకి తగ్గట్లుగా హౌస్ సెట్స్ ని, అలాగే AI క్యారెక్టర్స్ ని కరెక్ట్ గా శంకర్ వినియోగించలేదనే మాట ఇప్పుడు వినిపిస్తోంది.

Tags:    

Similar News