గేమ్ ఛేంజర్ రైటర్ గా పొలిటికల్ లీడర్.. శంకర్ స్కెచ్ అంటే అది..

మధురై నియోజకవర్గానికి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఎస్ వెంకటేషన్.. గేమ్ ఛేంజర్ కు రచయితగా పనిచేసినట్లు తెలుస్తోంది.

Update: 2024-12-18 11:35 GMT

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్.. గేమ్ ఛేంజర్ మూవీతో సంక్రాంతి బరిలో దిగుతున్న విషయం తెలిసిందే. కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఆ సినిమా జనవరి 10వ తేదీన విడుదల కానుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నట్లు తెలుస్తోంది.

అదే సమయంలో మేకర్స్ జోరుగా ప్రమోషన్స్ చేపడుతున్నారు. వరుస అప్డేట్స్ తో సందడి చేస్తున్నారు. ఇప్పటికే మూడు సాంగ్స్, టీజర్ ను రిలీజ్ చేశారు. డిసెంబర్ 21వ తేదీన అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించనున్నారు. ఆ సమయంలో థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేయనున్నారు.

మూడేళ్లకు పైగా షూటింగ్ జరుపుకున్న గేమ్ ఛేంజర్.. ఆడియన్స్ లో మంచి హైప్ సృష్టిస్తోంది. ఇప్పుడు మరింత అంచనాలు పెంచే ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కార్తీక్ సుబ్బరాజు అందించిన కథతో శంకర్ సినిమాను తెరకెక్కించగా.. ఇప్పుడు తమిళనాడుకు చెందిన ఓ రాజకీయ నాయకుడు రచయితగా వ్యవహరించారట.

మధురై నియోజకవర్గానికి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఎస్ వెంకటేషన్.. గేమ్ ఛేంజర్ కు రచయితగా పనిచేసినట్లు తెలుస్తోంది. పొలిటికల్ లీడర్ గానే కాకుండా.. ఆయనకు రచయితగా మంచి పేరుంది. ప్రముఖ వీర యుగ నాయగన్ నవలను ఆయనే రాశారు. కావల్ కొట్టం మరో నవల కూడా ఆయన కలం నుంచి వచ్చిందే.

అయితే వీర యుగ నాయకన్ హక్కులను శంకర్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అలా వెంకటేషన్ కు ఆయనతో మంచి పరిచయం ఏర్పడింది. ఇప్పుడు ఆ పరిచయంతోనే గేమ్ ఛేంజర్ కు రచయితగా వర్క్ చేశారట. సినిమాలో చరణ్ పోషించిన ఐఏఎస్ క్యారెక్టర్ విషయంలో తనదైన శైలిలో సహకరించారని తెలుస్తోంది.

ఆ క్యారెక్టర్ ను లోతుగా డిజైన్ చేయడంలో వెంకటేషన్ తన టాలెంటెడ్ ఇన్ పుట్స్ ఇచ్చారని సమాచారం. సెట్స్ కు ఎప్పటికప్పుడు వస్తుండేవారట. వచ్చిన ప్రతిసారి సలహాలు సూచనలు ఇచ్చేవారని తెలుస్తోంది. చరణ్ ఐఏఎస్ రోల్ బెస్ట్ గా వచ్చేలా చాలా ట్రై చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి శంకర్.. చరణ్ రోల్ అదిరిపోయేలా ఉండేందుకు వెంకటేషన్ ను రంగంలోకి దించారట. మరి మూవీ ఎలా ఉంటుందో.. చరణ్ రోల్ ఎలా మెప్పిస్తుందో వేచి చూడాలి.

Tags:    

Similar News