ఆ కారణంతో ఎన్నో సినిమాలకు నో చెప్పిన తాప్సి..

ఈ విషయంపై తాజాగా స్పందించిన తాప్సి తన కెరీర్ కు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

Update: 2024-08-01 17:30 GMT

సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరో హీరోయిన్లు సంవత్సరానికి 7 ,8 సినిమాలకు పైగా చేసేవారు. షూటింగ్ తో అస్సలు ఖాళీ లేకుండా చాలా బిజీగా ఉండేవారు. అయితే ఇప్పుడు స్టార్ హీరోలు సంవత్సరానికి ఒక్క సినిమా చేస్తే ఎక్కువ అన్నట్లుగా ఉంది పరిస్థితి. మరికొందరికి అయితే ఒక సినిమా పూర్తయ్యేటప్పటికి రెండు మూడు సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఈ నేపథ్యంలో నటి తాప్సీ పన్ను 4 సంవత్సరాల వ్యవధిలో 11 సినిమాలలో నటించింది. ఇదే టైంలో ఆమె మరెన్నో చిత్రాలకు నువ్వు కూడా చెప్పిందట.

కరోనా తరువాత అత్యధిక సినిమాలు చేసిన నటుడిగా అక్షయ్ కుమార్ గుర్తింపు తెచ్చుకోగా.. హీరోయిన్లలో మాత్రం ఆ క్రెడిట్ తాప్సీ దక్కించుకుంది. ఈమె నటించిన 11 చిత్రాలలో కొన్ని మంచి సక్సెస్ కూడా అందుకున్నాయి. అయితే మరికొన్ని మాత్రం యావరేజ్ గా మిగిలిపోయా. ఇక ఆ విషయం పక్కన పెడితే తాప్సి నటించినా 'ఫిర్ ఆయీ హసీనా దిల్రుబా', 'ఖేల్ ఖేల్ మే’సినిమాలు ఆరు రోజులవ్యవధిలో ఒకేసారి విడుదల కాబోతున్నాయి. ఈ విషయంపై తాజాగా స్పందించిన తాప్సి తన కెరీర్ కు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

కరోనాకి ముందు తన కెరీర్ విషయంలో ఎంతో ప్లానింగ్ చేసుకుందట. కనీసం సంవత్సరానికి రెండు సినిమాలలో అయినా నటించాలి అని ఫిక్స్ అయిందట. అయితే కరోనా కారణంగా అది అస్సలు కుదరలేదు. ఆ తర్వాత వచ్చిన సినిమాలు వరుసగా విడుదలయ్యాయి. అలా దాదాపు నాలుగేళ్ల వ్యవధిలో సుమారు 11 చిత్రాలలో ఆమె నటించింది. అయితే ఇదేది ముందుగా ప్లాన్ చేసింది కాదు అని తాప్సి స్పష్టం చేసింది.

ఇప్పుడు తాజాగా ఆమె నటించిన రెండు చిత్రాలు ఇంచుమించు ఒకేసారి విడుదల కాబోతున్నాయి. అయితే వీటిలో ఒకటి థియేటర్లో విడుదల అవుతుండగా మరొకటి మాత్రం డైరెక్ట్ గా ఓటీటీలో విడుదలవుతుంది. అంతేకాదు తాను పాత్రల విషయంలో ఎప్పుడు ఆచితూచి అడుగులు వేస్తాను అని తాపసి స్పష్టం చేశారు. అందుకే పింక్ సినిమా తర్వాత అటువంటి పాత్రలు వచ్చినప్పటికీ ఆమె వాటిని ఒప్పుకోలేదంట. ఎందుకంటే పింక్ అనేది ఆమె దృష్టిలో ఒక ఐకానిక్ మూవీ.. మళ్లీ అదే తరహా చిత్రంలో చేయడం వల్ల అసలు పాత్రకి ఉన్న ప్రాముఖ్యత పాడవుతుందని. అందుకే తిరిగి మళ్ళీ అటువంటి పాత్రలకు ఒప్పుకోలేదట. తాప్సి నటించిన 'ఖేల్ ఖేల్ మే' ఆగస్టు 15న థియేటర్లో విడుదల అవుతుండగా 'ఫిర్ ఆయీ హసీనా దిల్రుబా' ఆగస్టు 9న నెట్ ప్లెక్స్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

Tags:    

Similar News