తాప్సి.. తెల్లని చీరలో హై గ్లామర్ ట్రీట్

నాజూకైన నడుము అందాలు చూపిస్తూ వయ్యారంగా దిగిన ఈ ఫోటోని నెటిజన్లు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

Update: 2024-01-25 08:09 GMT

సౌత్ ఇండియాలో కమర్షియల్ హీరోయిన్ గా సుదీర్ఘకాలం కెరియర్ కొనసాగించి ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ హీరోయిన్ గా దూసుకుపోతున్న అందాల భామ తాప్సి. ఈ అమ్మడు ఓ వైపు ఫీమేల్ సెంట్రిక్ కథలు, మరో వైపు ఇతర హీరోల సినిమాలలో హీరోయిన్ గా నటిస్తూ ఫుల్ బిజీ ఉంది. లేడీ ఒరియాంటెడ్, రియల్ లైఫ్ స్టోరీస్ కి ఒకప్పుడు కంగనా రనౌత్ కేరాఫ్ అడ్రెస్ గా ఉంటే, ప్రస్తుతం ఆ స్థానాన్ని తాప్సి ఆక్యుపై చేసింది.


రీసెంట్ గా డంకీ సినిమాలో షారుఖ్ ఖాన్ కి జోడీగా ఈ అమ్మడు నటించింది. ఈ మూవీ హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీనికంటే ముందుగా ఫీమేల్ సెంట్రిక్ కథలతో తాప్సి చేసిన సినిమాలేవీ ఆశించిన స్థాయిలో మెప్పించలేదు. వీటిలో ఇండియన్ విమెన్ క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్ కూడా ఉంది. ఇక ఈ మధ్య నిర్మాతగా కూడా తాప్సి మారింది. బ్లర్, ధక్ ధక్ అనే రెండు సినిమాలు చేసింది.


ఈ రెండు కమర్షియల్ సక్సెస్ కాలేదు. అయితే డంకీ మూవీతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ఏకంగా మూడు హిందీ సినిమాలు ఉండటం విశేషం. ఈ సినిమాలన్నీ ఈ ఏడాదిలోనే వచ్చే అవకాశం ఉంది. బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన తర్వాత తాప్సి సౌత్ ఇండస్ట్రీని పూర్తిగా పక్కన పెట్టింది. అయితే ఇన్ స్టాగ్రామ్ లో మాత్రం అభిమానులకి అందుబాటులో ఉంటుంది.

తాజాగా వైట్ కలర్ శారీలో అదిరిపోయే ఫోజులుతో తాప్సి షేర్ చేసిన ఫోటో కుర్రాళ్ళకి మంచి కిక్ ఇచ్చేలా ఉంది. నాజూకైన నడుము అందాలు చూపిస్తూ వయ్యారంగా దిగిన ఈ ఫోటోని నెటిజన్లు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ పిక్ షేర్ చేసిన గంటలోనే లక్ష మంది లైక్ చేయడం విశేషం. దీనిని బట్టి తాప్సికి ఏ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈ మధ్య గ్లామర్ తో పాటు కాస్త ట్రెడిషన్ లుక్ ను కూడా అమ్మడు గట్టిగానే హైలెట్ చేస్తోంది.

రెగ్యులర్ అప్డేట్స్ తో పాటు అప్పుడప్పుడు హాట్ ఫోటోషూట్ లతో సందడి చేస్తోంది. ఇన్ స్టాలో ఈ ముద్దుగుమ్మని ఫాలో అయ్యే వారు 20.6 మిలియన్స్ వరకు ఉన్నారు. దీంతో ఈ బ్యూటీ ఇన్ స్టాలో ఫోటో షేర్ చేస్తే లక్షల్లో అభిమానులు చూస్తూ ఉంటారు. ఇక తెలుగులో అమ్మడు సినిమాలు చేసి కాలమైంది. ఇటీవల వచ్చిన బిగ్ మూవీ డుంకి అమ్మడికి పెద్దగా క్రేజ్ తీసుకు రాలేదు. మరి రాబోయే సినిమాలు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయో చూడాలి.


Tags:    

Similar News