తాప్సీని బాలీవుడ్ ఎగతాళి చేసిందా?
తాప్సీ కొంత కాలంగా బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ కంటే బాలీవుడ్ లో బెటర్ గానే కొనసాగుతుంది
తాప్సీ కొంత కాలంగా బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ కంటే బాలీవుడ్ లో బెటర్ గానే కొనసాగుతుంది. అక్కడికి వెళ్లిన తర్వాత సొంతంగా నిర్మాణ సంస్థని సైతం స్థాపించి పరిమిత బడ్జెట్ లో సినిమాలు నిర్మిస్తుంది. అక్కడి సెలబ్రిటీలందరితో అంతే మింగిల్ అవుతుంది. అక్కడే స్థిరపడాలి అన్న ఉద్దేశంతో అమ్మడు బాలీవుడ్ లో ముందుకు సాగుతుంది. అందుకు తగ్గ ప్రణాళిక వేసుకుని వెళ్తుంది.
దాదాపు గా నాలుగైదేళ్లగా అక్కడే బిజీగా ఉంది. గత ఏడాది ఒకే ఒక్క సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చినా ఈ ఏడాది మాత్రం నాలుగైదు సినిమాలో రావడం పక్కాగా కనిపిస్తుంది. ఇప్పటికే కొన్ని కమిట్ అయిన ప్రాజెక్ట్ లు ఉన్నాయి. అవి షూటింగ్ దశలో ఉన్నాయి. మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి. లాక్ అయితే ఏడాది ముగింపుకల్లా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు వచ్చేయడం ఖాయం. ఇలా తాప్సీ కెరీర్ ఉత్తరాదిన సంతోషంగా సాగిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
`నా మనస్తత్వాన్ని ఉద్దేశించి ఎంతో మంది ఎగతాళి చేసారు. ఒకరిని చూసి మరోకరు కించపరిచే ప్రయత్నం చేసారు. ఎన్నో విమర్శలు సైతం కావాలని చేసేవారు. కానీ అవేవి నా జీవితాన్ని ప్రభావితం చేయలేదు. అలా ఎందుకు జరిగిందంటే నేను ఎంచుకున్న సినిమాలే కారణం. తప్పోఒప్పో చాలా సినిమాలు చేసాను. వాటి ద్వారా ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను. నన్ను పైకి తీసుకురావడంలో ఆ పాఠాలు గుణపాఠాలుగా మలుచుకున్నాను.
కానీ ఇవేవి నన్ను విమర్శించిన వాళ్లు తర్వాతి కాలంలో గుర్తించారో? లేదా? నాకు తెలియదు. నేను మాత్రం అలాంటి వాళ్లను పట్టించుకోను. కథలు, పాత్రల విషయంలో నా సొంత నిర్ణయంపైనే ముందుకెళ్తాను. ఎవరో ఏదో అన్నారని పట్టించుకుంటే జీవితంలో ముందుకెళ్లలేం` అని తెలిపింది.