క్రీడాకారులలో లింగ పరీక్ష సరికాదన్న తాప్సీ
2024 పారిస్ ఒలింపిక్స్‌లో అల్జీరియన్ బాక్సర్ ఇమానే ఖలీఫ్ లింగ అర్హత వివాదంపై తాప్సీ పన్ను తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది
2024 పారిస్ ఒలింపిక్స్‌లో అల్జీరియన్ బాక్సర్ ఇమానే ఖలీఫ్ లింగ అర్హత వివాదంపై తాప్సీ పన్ను తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఖేలిఫ్ సహా మరో మహిళా ఒలింపిక్ బాక్సర్ చైనీస్ తైపీకి ప్రాతినిధ్యం వహిస్తున్న లిన్ యు-టింగ్.. వారి లింగం, మహిళలతో పోటీపడే అర్హత గురించి తీవ్రంగా పరిశీలనను కొనసాగిస్తున్నారు. ఒలింపిక్స్‌లో 66 కేజీల మహిళల బాక్సింగ్‌లో ఖలీఫ్ యాంగ్ లియును ఓడించి స్వర్ణం గెలుచుకుంది. కానీ లింగ నిర్ధారణ విషయంలో ఆమె అవమానాలకు గురైంది.
ఏఎన్ఐతో చాటింగ్ సెషన్‌లో తాప్సీ ఈ లింగ పరీక్ష సమస్యను ప్రస్తావించారు. క్రీడారంగంలో లింగ పరీక్షకు సంబంధించిన అంశంతో `రష్మీ రాకెట్` చిత్రాన్ని రూపొందించామని తాప్సీ తెలిపారు. ఈ గొడవ మా సినిమాకి సమాంతరంగా ఉంది. తాప్సీ మహిళా అథ్లెట్‌గా నటించిన రష్మీ రాకెట్ చిత్రం సహజ హార్మోన్ స్థాయిల ఆధారంగా అథ్లెట్లను అనర్హులుగా ప్రకటించే విధానాన్ని విమర్శనాత్మకంగా విశ్లేషిస్తుంది.
ఇదే సమస్యపై నేను ఒక పాత్రను పోషించాను. నేను రష్మీ రాకెట్ అనే సినిమా చేసాను. ఒక మహిళా అథ్లెట్‌లో టెస్టోస్టెరాన్ అధిక స్థాయిలో ఉన్నట్లు గుర్తించినందుకు క్రీడల నుంచి నిషేధానికి గురవుతుంది. నేను ఈ పాత్రను పోషించాను గనుక ఒలింపిక్స్ పై నేను అభిప్రాయాలను తెలిపాను. బహుశా ఇలా చర్చించే విధంగా ఉంటుంది కనుకనే నేను నటించే చిత్రాలకు అది అందం అని నేను అనుకుంటున్నాను. కొన్నిసార్లు నేను బయటికి ప్రకటించకుండానే సమస్యలపై ప్రస్థావించే సినిమాలను ఎంచుకుంటున్నాను! అని తాప్సీ అన్నారు.
రష్మీ రాకెట్‌లో తన పాత్ర ఖలీఫ్‌కి సంబంధించిన ప్రస్తుత వివాదాన్ని ప్రతిబింబించిందని తాప్సీ అన్నారు. అధిక స్థాయి టెస్టోస్టెరాన్ ఆధారంగా అనర్హతకు సంబంధించిన ప్రమాణాలను తాప్సీ ఈ సందర్భంగా ప్రశ్నించింది. ఈ జీవ లక్షణాలు అథ్లెట్ల నియంత్రణ పరిధిలో లేనివి అని తాప్సీ వాదించారు. రష్మీ రాకెట్ చిత్రంలో మా వాదన ఏమిటంటే.. చాలా మంది అథ్లెట్లు ఇతరుల కంటే గొప్ప ఎనర్జీతో జన్మించారు. ఉసేన్ బోల్ట్ , మైఖేల్ ఫెల్ప్స్ వలె, ఈ వ్యక్తులందరి జన్యువులు పూర్తిగా వేరు. వాటిని ఎందుకు నిషేధించలేదు? టెస్టోస్టెరాన్ అధిక స్థాయి ఉన్న వ్యక్తిని మాత్రమే ఎందుకు నిషేధించారు? అని తాప్సీ ప్రశ్నిస్తున్నారు.
పోటీ కోసం ఇంజెక్షన్లు తీసుకున్నట్లయితే అది పూర్తిగా చట్టవిరుద్ధం.. ఆమెను నిషేధించాలి. కానీ తన నియంత్రణలో లేని టెస్టోస్టిరాన్ కారణంగా ఆమెను నిషేధించారు. సినిమాలో నేను పోషించిన పాత్ర కూడా అదే... కాబట్టి నా ప్రకటనను పరిశీలించండి! అని తాప్సీ అన్నారు. తాప్సీ వ్యాఖ్యలు ఆలోచింపజేసేవిగా ఉన్నాయి. క్రీడలలో లింగ పరీక్ష చుట్టూ చర్చ జరిగేలా ఈ వ్యాఖ్యలు ఫలవంతం అయ్యాయి.