ఈ ప్ర‌శ్న మ‌గ న‌టుల‌నే ఎందుకు అడ‌గ‌రు?

''ఈ టాపిక్ గురించి కేవలం న‌టీమ‌ణులను మాత్రమే ఎందుకు అడుగుతున్నారు? మ‌గ‌ నటులను ఎందుకు అడగలేదు?''అంటూ ట‌బు ఆశ్చర్యపోయింది.

Update: 2024-08-02 05:03 GMT

సినీరంగంలో పురుషాధిక్య‌త గురించి పారితోషికం, గౌర‌వంలో అస‌మాన‌త‌ల గురించి ప‌లువురు క‌థానాయిక‌లు బ‌హిరంగంగానే చ‌ర్చించారు. క్వీన్ కంగ‌న ర‌నౌత్, స‌మంత, న‌య‌న‌తార స‌హా చాలా మంది క‌థానాయిక‌లు పారితోషికాల్లో అస‌మాన‌త‌ల గురించి ప్ర‌స్థావించారు. అయితే హీరోల డామినేష‌న్ స‌మ‌ర్థ‌నీయ‌మైన‌ద‌ని, వారి వ‌ల్ల‌నే జ‌నం థియేట‌ర్ల‌కు వ‌స్తార‌ని అంగీక‌రించిన క‌థానాయిక‌లు లేక‌పోలేదు. అదంతా అటుంచితే ఇప్పుడు వేత‌న అస‌మాన‌త గురించి చ‌ర్చ‌ల్లో భాగంగా జాతీయ ఉత్త‌మ న‌టి ట‌బు హెడ్ లైన్స్ లో కొచ్చారు.

టబు -అజయ్ దేవగన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన 'ఔరోన్ మే కహాన్ దమ్ థా' చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. విడుదలకు ముందు ప్ర‌చారంలో ట‌బుకి ఒక ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న ఎదురూంది. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో వేతన సమానత్వం గురించి యాంక‌ర్ ప్ర‌శ్నించ‌గా.. ''ఈ టాపిక్ గురించి కేవలం న‌టీమ‌ణులను మాత్రమే ఎందుకు అడుగుతున్నారు? మ‌గ‌ నటులను ఎందుకు అడగలేదు?''అంటూ ట‌బు ఆశ్చర్యపోయింది.

మ‌న‌ పరిశ్రమలో నిరంతర లింగ వేతన వ్యత్యాసాల గురించి మహిళా నటీనటులను మాత్ర‌మే రెగ్యుల‌ర్ గా ఎందుకు ప్రశ్నిస్తున్నారు? అని టబు ప్ర‌శ్నించారు. ప్రతి మీడియా వ్యక్తి న‌టీమ‌ణుల‌ను(మ‌హిళ‌ల్ని) వేతన సమానత్వం గురించి అడుగుతారని, మేల్ న‌టుల‌కు ఎక్కువ జీతం ఇస్తున్నారని మహిళా నటులు చెబుతారని ట‌బు అన్నారు. మ‌గ న‌టుల‌కు ఎక్కువ జీతం ఇస్తున్న వ్యక్తిని ఎందుకు అడగకూడదు? అని టబు నిల‌దీసారు.

ఇలాంటి ప్ర‌శ్న‌ల‌తో సమస్యను రెగ్యుల‌ర్ గా సంచలనంగా మార్చేందుకు మీడియా వ్య‌క్తులు ప్రయత్నిస్తారని ట‌బు అన్నారు. నాకు తక్కువ పారితోషికం ఇవ్వడాన్ని నేను ద్వేషిస్తున్నాను..లేదా నేను ఏం చేస్తున్నానో దానికి చెల్లించారు గ‌నుక నాకు ఓకే.. అని చెబుతాను. అప్పుడు వారికి ఓకే. మీకు ఎక్కువ పారితోషికం ఎందుకు ఇస్తున్నారని మేల్ న‌టుల‌ను ఎందుకు అడగరు? ఇది దృక్కోణాన్ని మార్చవచ్చు క‌దా! అని అభిప్రాయ‌ప‌డ్డారు. స‌మాన‌త్వంతో కూడిన‌ పరిశ్రమను రూపొందించడానికి వేతన అసమానత గురించి చ‌ర్చ‌లు ముఖ్యమైనవి. సరైన వ్యక్తులను ప్ర‌శ్నిస్తే మంచిద‌ని టబు పేర్కొన్నారు.

త్వ‌ర‌లో విడుద‌ల‌కు రానున్న 'ఔరోన్ మే కహన్ దమ్ థా' రొమాంటిక్ ప్రేమ‌క‌థా చిత్రం. దేవగన్ పాత్ర 22 సంవత్సరాల తర్వాత జైలు నుండి విడుదల‌వుతుంది.. ఆ తర్వాత అజయ్ - టబు మళ్లీ కలుసుకుంటారు. 23 సంవత్సరాల పాటు సాగే మ్యూజికల్ రొమాంటిక్ ల‌వ్ డ్రామా ఇది. ఈ కథ 2000 - 2023 మధ్య కాలంలో సాగుతుంది.

అజయ్ దేవగన్ - టబుతో పాటు ఇందులో సాయి మంజ్రేకర్, జిమ్మీ షెర్గిల్, శాంతను మహేశ్వరి ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. నీరజ్ పాండే దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పనోరమా స్టూడియోస్‌పై నరేంద్ర హిరావత్, శీతల్ భాటియా, కుమార్ మంగత్ పాఠక్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ముందుగా జూలై 5న విడుదల కావాల్సి ఉంది. తరువాత జూలై 26కి డేట్ మార్చారు. ఇప్పుడు ఎట్టకేలకు ఆగస్టు 2న థియేటర్లలో విడుదల కానుంది.

Tags:    

Similar News