'తాళి-ఎగతాళి' రిజిస్టర్ అయిందా?
ఈ నేపథ్యంలో తాజాగా ఫిలిం ఛాంబర్ లో 'తాళి-ఎగతాళి' అనే టైటిల్ రిజిస్టర్ అయినట్లు సమాచారం.
ఇటీవలే జనసేన అధినేత..నటుడు పవన్ కళ్యాణ్ పై సినిమా చేస్తున్నట్లు ఏపీ నీటిపారుదలా శాఖ మంత్రి అంబటి రాంబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీని లో భాగంగా ఆయన మీడియా ముఖంగా కొన్ని టైటిల్స్ కూడా రివీల్ చేసారు.'నిత్య పెళ్లి కొడుకు'- 'బహు భార్య ప్రావీణ్యుడు'- 'పెళ్లిళ్లు పెటాకులు'- 'తాళి-ఎగతాళి'- 'మూడు ముళ్లు-ఆరు పెళ్లిళ్లు'- 'బ్రో 'లాగా 'మ్రో' (మ్యారేజస్- రిలేషన్స్- అఫెండర్) ఇలా కొన్ని టైటిల్స్ తో కూడిన పోస్టర్లని మీడియాకి చూపించారు.
అయితే ఇవన్నీ తమ సినిమాకి పరిశీలన లో ఉన్నాయని..ఇంకా ఏవైనా టైటిల్స్ వస్తే వాటిని కూడా పరిశీలించి తమ సినిమాకి మంచి ఊపును టైటిల్ నిర్ణయిస్తామని అన్నారు. అలాగే తమది భారీ బడ్జెట్ చిత్రం కాదని ..లో బడ్జెట్ సినిమా మాత్రమనన్నారు. అయితే ఈ సినిమా లో హీరో ఎవరు? హీరోయిన్లు ఎవరు? దర్శకుడు ఎవరు? వంటి తదితర వివరాలు తర్వాత రివీల్ చేస్తామని చెప్పారు.
ఈ నేపథ్యంలో తాజాగా ఫిలిం ఛాంబర్ లో 'తాళి-ఎగతాళి' అనే టైటిల్ రిజిస్టర్ అయినట్లు సమాచారం. ఇదే పేరుతో ఓ యువ నిర్మాత ఈ టైటిల్ ని ఛాంబర్ లో రిజిస్టర్ చేయించినట్లు తెలిసింది. ఈ టైటిల్ రాంబాబు కి సంబంధించిన వారు రిజిస్టర్ చేయించారా? లేక బయట వ్యక్తులు ఎవరైనా రిజిస్టర్ చేయించారా? అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. అంబటి రాంబాబు తమ సినిమాకి తాళి-ఎగతాళి అనేది పరిశీలన లో మాత్రమే ఉందని అన్నారు.
వాటిని రిజిస్టర్ చేయించారా? లేదా? అన్నది స్పష్టంగా చెప్పలేదు. ఇంతలోనే ఈ టైటిల్ రిజిస్టర్ అవ్వడం ఆసక్తికరంగా మారింది. మరి ఈ టైటిల్ వెనుక పూర్తి సమాచారం ఏంటి? అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఏపీ లో చోటు చేసుకున్న రాజకీయ వాతావరణం విమర్శలు..ప్రతి విమర్శల నేపథ్యంలో ఆసక్తికరంగా మారిన సంగతి తెలిసిందే. నెట్టింట వైరల్ అయిన అంబటి రాంబాబు డాన్సింగ్ వీడియో ని 'బ్రో 'సినిమాలో శ్యాంబాబు పేరుతో ఇమిటేట్ చేయించినట్లు రాంబాబు ఆరోపించారు. అటు పై రచయిత.. దర్శకుడు త్రివిక్రమ్ కి ఆయన హెచ్చరికలు జారీ చేసారు.