గ్రాజియా షూట్: తమన్నా కిల్లర్ ఫోజ్
మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా భాటియా సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ కెరీర్ ని బ్యాలెన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే.
మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా భాటియా సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ కెరీర్ ని బ్యాలెన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే `జైలర్` లాంటి బ్లాక్ బస్టర్ చిత్రంలోను తమన్నా నటించింది. ఇక ఈ భామ సోషల్ మీడియాల్లో నిరంతరం అద్భుతమైన ఫోటోషూట్లను షేర్ చేస్తుంటే అవి ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి.
తాజాగా `గ్రాజియా కవర్ షూట్`లో తమన్నా స్పెషల్ లుక్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది. ఈ ఫోటోలను షేర్ చేసిన క్షణాల్లో నెట్ లో వైరల్ గా మారాయి. తమన్నా తాజా పోటోషూట్ లో ఎలిజబెత్ టేలర్ ని తలపిస్తోంది. మిల్కీ తన దేహశిరులకు తగినట్టుగా చెక్డ్ డిజైనర్ లుక్ ని ఎంపిక చేసుకుంది. కాటుక కళ్లు, లైట్ లిప్ కలర్ తో యూనిక్ గా కనిపిస్తోంది. బ్యాక్ గ్రౌండ్ లో సెట్ చేసిన మెటీరియల్ యాంబియెన్స్ దీనిని మరింత అందంగా ఎలివేట్ చేస్తున్న సంగతి తెలిసిందే.
మీరు చూడనివి 5000 ఫోటోలు ఉన్నాయి:
ఇటీవల కొంతకాలంగా నటుడు విజయ్ వర్మ- తమన్నా భాటియా ప్రేమాయణం గురించి మీడియాలో కథనాలొస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ తక్కువ సమయంలో తమన్నాతో తన రిలేషన్ గురించి ఎందుకు బహిరంగపరిచాడో వెల్లడించాడు. ``మేం కలిసి సమయాన్ని గడపడానికి ఇష్టపడితే ..ఒకరినొకరు ఇష్టపడితే, ఈ విషయాన్ని దాచాల్సిన అవసరం లేదు. సంబంధాన్ని దాచడానికి చాలా ప్రయత్నం అవసరం. మేం చేయలేం. కలిసి బయటకు వెళ్లాలి. నేను పంజరంలో ఉండాలనుకోలేదు`` అని అన్నారు.
కొన్ని విషయాలు దాచాను. నా వద్ద 5,000 కంటే ఎక్కువ ఫోటోలు మా బంధానికి సంబంధించినవి ఎవరూ చూడనివి ఉన్నాయని విజయ్ వర్మ అన్నారు. హృదయానికి దగ్గరగా ఉన్న వాటినిసోషల్ మీడియాలో షేర్ చేయలేదని చెప్పారు. విజయ్ వర్మ - తమన్నా భాటియా లస్ట్ స్టోరీస్ 2 సెట్‌లో ప్రేమలో పడ్డారు. అంతకుముందు నలుగురు వ్యక్తులు మాత్రమే హాజరైన షో ర్యాప్-అప్ పార్టీలో తమన్నాకు లవ్ ఎక్స్ ప్రెస్ చేసానని విజయ్ తెలిపారు.