బాలీవుడ్ (X) సౌత్ : బాంబ్ పేల్చిన తమన్నా
తమన్నా ఇంకా ఏమన్నారంటే... నేను ప్రత్యేకంగా గమనించిన తేడా.. సౌత్ సినిమాలు వాటి భౌగోళిక స్థానాల పరంగా ఎక్కువగా మాట్లాడతాయి.
తమన్నా భాటియా 'స్ట్రీ 2' ఘన విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటోంది. తన అతిథి పాత్రకు మంచి గుర్తింపు దక్కింది. 'ఆజ్ కీ రాత్' పాటలో అద్భుత నర్తనలతో ఆకట్టుకున్న తమన్నాకు గొప్ప ప్రశంసలు లభించాయి. దక్షిణాదిన అగ్ర కథానాయికగా ఎదిగిన తమన్నా ఇటీవల బాలీవుడ్ లో వరుస చిత్రాలు చేస్తోంది. అదే క్రమంలో హిందీ చిత్రసీమపై తమన్నా పేల్చిన బాంబ్ ప్రకంపనాలు సృష్టిస్తోంది.
తన కెరీర్ గురించిన చర్చలో తమన్నా ఉత్తరాది(బాలీవుడ్) వర్సెస్ దక్షిణాది గురించి ప్రస్థావించింది. దక్షిణాది చిత్రాలు విభిన్న కథా విధానాన్ని ప్రతిబింబిస్తాయని తమన్నా ప్రశంసించింది. ప్రేక్షకులతో లోతుగా కనెక్టయ్యే, వారి జీవితాల్లో ప్రతిధ్వనించే 'మూలాలు' ఉంటాయని, అలాంటి కథనాలపై దక్షిణాది దర్శకనిర్మాతలు దృష్టి సారిస్తారని తెలిపింది. సౌత్ సినిమాలు మనసులో ఎక్కువగా పాతుకుపోతాయి! అని తమన్నా భాటియా ప్రశంసించారు. రాజ్ షమణి పోడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో.. తమన్నా బాలీవుడ్ వర్సెస్ సౌత్ గురించి తన అభిప్రాయాలను చెబుతూ తాను గమనించిన వైరుధ్యాల గురించి ఇన్ డెప్త్ గా మాట్లాడటం చర్చగా మారింది.
తమన్నా ఇంకా ఏమన్నారంటే... నేను ప్రత్యేకంగా గమనించిన తేడా.. సౌత్ సినిమాలు వాటి భౌగోళిక స్థానాల పరంగా ఎక్కువగా మాట్లాడతాయి. వారి కంటెంట్ ప్రపంచవ్యాప్తంగా అనువాదమవుతుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే వారు హృదయాలను హత్తుకునే, జీవంతో పాతుకుపోయిన కథలను చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. వ్యక్తుల అభిరుచి అనే దృక్కోణం నుండి ఏవీ పని చేయవు. వారు తల్లి, తండ్రికి సంబంధించిన ప్రాథమిక మానవ భావోద్వేగాలను వెతుకుతారు. సోదరుడు, సోదరిపై కథలు రాస్తారు. ప్రతీకారం... విభిన్న కథాకథన ఆకృతుల ద్వారా ప్రాథమిక మానవ భావోద్వేగాల గురించి మరెన్నో కథలను చెబుతారు. వారు తమ దృక్పథాన్ని అలాగే ఉంచడం గురించి కూడా చాలా శ్రద్ధ వహిస్తారు. విభిన్న వర్గాల ప్రజలకు సేవ చేయడానికి ప్రయత్నించరు. తమకు పూర్తిగా తెలిసిన విషయాలను మాత్రమే చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది దక్షిణాదికి బాగా వర్కవుటైందని నేను అనుకుంటున్నాను.
బాలీవుడ్ చిత్రాలను రెగ్యులర్ గా విస్తృత ఆకర్షణ కోసం రూపొందిస్తారని.. ఇది ఎల్లప్పుడూ విజయవంతం కాదని తమన్నా పేర్కొంది. ఇటీవల విడుదలైన 'లాపాటా లేడీస్'ను తమన్నా ప్రశంసించింది. ఇది ప్రేక్షకుల నుండి విస్తృతమైన ప్రశంసలు పొందడమే గాక, సానుకూల దృష్టిని ఎలా పొందిందో హైలైట్ చేసింది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే... తమన్నా ఇటీవల 'స్ట్రీ 2'తో పోటీపడుతూ విడుదలైన 'వేదా'లో కనిపించింది. దురదృష్ట వశాత్తూ ఈ చిత్రం పరాజయం పాలైంది. నిఖిల్ అద్వానీ దర్శకత్వం వహించిన 'వేదా'లో జాన్ అబ్రహం, శర్వరి వాఘ్ ప్రధాన పాత్రల్లో నటించారు. తమన్నా ప్రాజెక్ట్‌లలో తెలుగులో అశోక్ తేజ సూపర్ నేచురల్ థ్రిల్లర్ 'ఓదెలా 2'... హిందీలో అమెజాన్ ప్రైమ్ వెబ్ సిరీస్ 'డేరింగ్ పార్టనర్స్' చిత్రీకరణ దశలో ఉన్నాయి.