సెకెండ్ ఇన్నింగ్స్ లో త‌మ‌న్నా ఇలా ఫిక్సైందా!

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా కెరీర్ జ‌ర్నీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. దాదాపు రెండు ద‌శాబ్ధాలుగా చిత్ర ప‌రిశ్ర‌మ‌లో కొన‌సాగుతుంది.

Update: 2024-11-30 13:30 GMT

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా కెరీర్ జ‌ర్నీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. దాదాపు రెండు ద‌శాబ్ధాలుగా చిత్ర ప‌రిశ్ర‌మ‌లో కొన‌సాగుతుంది. స్టార్ హీరోలంద‌రితోనూ సినిమాలు చేసింది. ఐటం భామ‌గా అల‌రించింది. కీల‌క పాత్ర‌లు సైతం పోషించింది. తెలుగుతో పాటు త‌మిళ్ లోనూ అంతే సక్సెస్ అయింది. హిందీలోనూ కొన్ని సినిమాలు చేసింది. వెబ్ సిరీస్ లు సైతం చేస్తుంది. సాధార‌ణంగా హీరోయిన్ కి ఇంత లాంగ్ కెరీర్ అన్న‌ది ఎవ‌రికో గానీ సాధ్యం కాదు.

కానీ త‌మ‌న్నా మాత్రం దాన్ని సాధ్యం చేసుకుంది. అందుకే ఇప్ప‌టికీ సినిమాలు చేయ‌గ‌ల్గుతుంది. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో అమ్మ‌డు పాత్ర‌ల నిడివి విష‌యంలో ఆస‌క్తిక‌ర విష‌యాలు పంచుకుంది. `ప్ర‌స్తుతం కెరీర్ లో ఎంతో మంచి ద‌శ‌ను ఆస్వాదిస్తున్నా. ఎందుకంటే పెద్ద‌, చిన్న అనే తేడా లేకుండా పాత్ర‌ల్ని ఎంచుకుంటూ వ‌చ్చిన అవ‌కాశాల‌తో ప్రేక్ష‌కుల్ని మెప్పిస్తున్నా. నా ల‌క్ష్యం కూడా అదే. ఎలాంటి పాత్ర పోషించిన అంతిమంగా అది ప్రేక్ష‌కుల‌కు న‌చ్చాలి.

అలా న‌చ్చ‌లేదు అంటే ఎంత గొప్ప పాత్ర అనుకున్నా అది వృద్ధా ప్ర‌య‌త్నంగానే మిగిలిపోతుంది. అలాంట ప్పుడు పాత్ర నిడివితో సంబంధం ఏముంది. చాలా మంది దృష్టిలో ప్ర‌స్తుతం నేను న‌టిస్తోన్న పాత్ర‌లు చిన్న‌వి కావొచ్చు. కానీ చిన్న‌దా పెద్ద‌దా? అన్నది మ‌నం చేసే పని మాత్ర‌మే నిర్దారిస్తుంది. ప్ర‌స్తుతం నేను ఆదిశ‌గానే అడుగులు వేస్తున్నా. ఇప్ప‌టివ‌ర‌కూ ఎన్నో చిత్రాల్లో హీరోయిన్ గా న‌టించా.

ఎంతో మంది హీరోల‌తో క‌లిసి ప‌నిచేసాను. కానీ ఏ రోజు నిడివి గురించి ఆలోచించ‌లేదు. అప్పుడు అలాంటి పాత్ర‌లొచ్చాయి న‌టించాను. ఇప్పుడు చేస్తోన్న పాత్ర‌లు వాటికి త‌క్కువేం కాద‌ని న‌మ్ముతున్నాను` అని అంది. ప్ర‌స్తుతం అమ్మ‌డు తెలుగులో ఓదెల‌-2లో న‌టిస్తోంది. ఇది త‌మ‌న్నా న‌టిస్తోన్న లేడీ ఓరియేంటెడ్ చిత్రం. వ‌చ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Tags:    

Similar News