బటర్ ప్లైలా మిల్కీబ్యూటీ సయ్యాట
మిల్కీబ్యూటీ తమన్నా పనైపోయిందన్న ప్రతీసారి తారా జువ్వులా పైకి లేస్తుంది. కొత్త అవకాశాలతో తమన్నా ఖాళీగా లేదని ప్రూవ్ చేస్తుంది
మిల్కీబ్యూటీ తమన్నా పనైపోయిందన్న ప్రతీసారి తారా జువ్వులా పైకి లేస్తుంది. కొత్త అవకాశాలతో తమన్నా ఖాళీగా లేదని ప్రూవ్ చేస్తుంది. గత రెండు మూడేళ్లగా తమన్నా తంతు ఇలాగే కనిపిస్తుంది. ఎంత మంది కొత్త భామలొచ్చినా నాకెవ్వరు సాటి అంటూ ముందుకు సాగిపోతుంది. వెబ్ సిరీస్ లతో సైతం మంచి పాపులారిటీ దక్కించుకోవడంతో సెకెండ్ ఇన్నింగ్స్ లో అక్కడా సత్తా చాటుతున్నట్లే కనిపిస్తుంది. ఉంటే సినిమాలు లేకపోతో సిరీస్ లంటూ కెరీర్ లో గ్యాప్ లేకుండా చూసుకుంటుంది.
మరోవైపు యువతని ఆకర్షించే ఫోటో షూట్లలోనూ తమన్నా వేడేమాత్రం తగ్గలేదనిపిస్తుంది. తాజాగా బ్యూటీ మరో కొత్త ఫోటోతో నెటి జనులముందుకొచ్చేసింది. ఇదిగో ఇక్కడిలా బటర్ ప్లై డిజైన్ దుస్తుల్లో తళుకులీనింది. బెలూన్ స్లీవ్లతో కూడిన చింట్జ్ స్లిట్ డ్రెస్లో తమన్నా మతి పొగొడుతుంది. అమ్మడి స్కిన్ షో సైతం అంతే హైలైట్ అవుతుంది. సింగపూర్ లో షూట్ చేసిన ఫోటో షూట్ ఇది. సింగపూర్ నేచుర్ బ్యూటీని కవర్ చేస్తూ..అక్కడి వాతావరణన్ని ప్రతిబింబించేలా డిజైన్ చేసిన దుస్తుల్లో లీనమైపోయింది.
తమన్నా అలంకరణ..మ్యాకప్ ప్రతీది కొత్తగా ప్రజెంట్ అవుతుంది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. అభిమానులు మరోసారి ఆమె బ్యూటీకి ఫిదా అవుతూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ఇక తమన్నా సినిమాల సంగతి చూస్తే క్షణం తీరిక లేకుండా గడుపుతుంది. కోలీవుడ్..బాలీవుడ్..టాలీవుడ్ అంటూ మూడు భాషల్ని దున్నేస్తుంది. తమిళ్ లో ఆరణ్మనై-4 లో నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూట్ పూర్తయింది.
హిందీలో 'వేద'..'స్త్రీ-2' లో నటిస్తోంది. తెలుగులో ఆమె మెయిన్ లీడ్ లో 'ఓదెల-2' అనే చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన తమన్నా లుక్ అభిమానుల్ని ఆకట్టుకుంది. తమన్నా కెరీర్ లో తొలి లేడీ ఓరియేంటెడ్ చిత్రమిది. ఈ సినిమా హిట్ అయితే తమన్నా కొత్త జర్నీ స్టార్ట్ అయినట్లే. ఫీమేల్ సెంట్రిక్ చిత్రాలతోనూ సత్తా చాటుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.