'ఇడియ‌ట్' అని తిట్టిన హీరోకి త‌మ‌న్నా మ‌ద్ధ‌తు

కానీ ఇడియ‌ట్ అని తిట్టేసిన జాన్ అబ్రహంను త‌మ‌న్నా సమర్థించింది.

Update: 2024-08-04 07:44 GMT

చాలా సినిమాల్లో రిపీటెడ్ గా అవే పాత్ర‌లు చేస్తున్నార‌ని విమ‌ర్శించిన జ‌ర్న‌లిస్టుపై బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్ర‌హాం విరుచుకుప‌డిన ఘ‌ట‌న హాట్ టాపిక్ గా మారింది. రిపీటెడ్‌గా అవే చేస్తున్నారు! అని ప్ర‌శ్నించిన జ‌ర్న‌లిస్టును జాన్ `ఇడియ‌ట్` అని మీడియా స‌మావేశంలోనే తిట్టేసారు. దీనిపై జాన్ మీడియా ప్ర‌తినిధుల‌ నుంచి వ్య‌తిరేక‌త‌ను ఎదుర్కొంటున్నారు. కానీ ఇడియ‌ట్ అని తిట్టేసిన జాన్ అబ్రహంను త‌మ‌న్నా సమర్థించింది.

యాక్షన్ థ్రిల్లర్ `వేదా`లో జాన్ అబ్రహాం స‌ర‌స‌న త‌మ‌న్నా క‌థానాయిక‌గా న‌టించింది. ఈవెంట్లో జాన్ వ్యాఖ్య‌ల‌కు త‌మ‌న్నా ఇప్పుడు మద్దతుగా నిలిచింది. ప్రేక్షకులను థియేటర్లలో సినిమాలను చూడాలని కోరుతూ సోష‌ల్ మీడియాల్లో ఒక సుదీర్ఘ నోట్ కూడా రాసింది త‌మ‌న్నా. ఈ నోట్ లో త‌న స‌హ‌న‌టుల‌ను త‌మ‌న్నా ప్ర‌త్యేకంగా ప్రశంసించింది. ఆగస్ట్ 15న మా సినిమా థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది. ఇది కేవలం యాక్షన్ చిత్రం మాత్ర‌మే కాదు.. అంత‌ కంటే ఎక్కువ అని అభిమానులు, అనుచరులకు మిల్కీ బ్యూటీ హామీ ఇచ్చింది.

దేశంలోని అభిమాన యాక్షన్ హీరోలలో జాన్ ఒకరు అని కూడా త‌మ‌న్నా ప్ర‌శంసించింది. ఆగష్టు 3న `వేదా` ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఘ‌ట‌న త‌ర్వాత‌ కొన్ని రోజులకు తమన్నా భాటియా తన X (గతంలో ట్విట్టర్)లో ఈ నోట్ రాసింది. ఈ నోట్ లో జాన్ అబ్ర‌హాంని నా స్నేహితుడు అంటూ ప్ర‌స్థావించిన త‌మ‌న్నా అత‌డు దేశంలోని గొప్ప యాక్ష‌న్ స్టార్ల‌లో ఒక‌రు అని అన్నారు. వేద చిత్రం అత‌డి శైలి స్టంట్స్ తో అద్భుతంగా ఉంటుంద‌ని ప్ర‌శంసించింది. అతడు యాక్షన్ ద్వారా విభిన్నమైన కథను చెబుతున్నాడు. ఈ జానర్ ఈ రోజు అర్థవంతమైన సినిమా అంటే ఏమిటో లోతుగా తెలియజేస్తుంది.

7 సంవత్సరాల విరామం తర్వాత చిత్ర దర్శకుడు నిఖిల్ అద్వాణీ తిరిగి ఫిలింమేకింగ్ లోకి వ‌చ్చార‌ని, ఇది సినిమాని మరింత ప్రత్యేకంగా మార్చిందని కూడా తమన్నా ప్రస్తావించింది. కల్ హో నహ్ హో, కట్టి బట్టి, సలామ్-ఇ-ఇష్క్, పాటియాలా హౌస్ చిత్రాల‌కు నికిల్ అద్వానీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఆయ‌న‌ చివరిసారి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `బాట్లా హౌస్‌` ఆక‌ట్టుకుంది. ఆరేడు సంవత్సరాల తర్వాత నిఖిల్ అద్వానీ దర్శకుడిగా తిరిగి రావడం, వ్యక్తిగతంగా నాకు మరింత ఉత్తేజకరమైన విషయం. ఇది మా సినిమాపై నిరీక్షణను మ‌రింత పెంచింది. త‌న స‌హ‌న‌టి శార్వ‌రిపైనా త‌మ‌న్నా ప్ర‌శంస‌లు కురిపించింది.

తన పాత్ర గురించి త‌మ‌న్నా మాట్లాడుతూ... అద్భుత‌మైన న‌టీన‌టులు బృందంతో క‌లిసి ప‌ని చేసినందుకు నిజంగా చాలా సంతోషిస్తున్నాను. ఈ చిత్రం మన దేశంలో యాక్షన్ చిత్రాలకు సరికొత్త దృక్కోణాన్ని తీసుకువస్తుందనేది నా ప్రామిస్. ప్రతి ఒక్కరూ ఈ కొత్త కథను పెద్ద తెరపై అనుభవించడానికి ఇష్టపడతారని నేను భావిస్తున్నాను.. అని కూడా త‌మ‌న్నా వ్యాఖ్యానించింది. 2024 స్వాతంత్య్ర‌ దినోత్సవం రోజున `ఖేల్ ఖేల్ మే`, `స్త్రీ 2`తో పాటు `వేదా` చిత్రం పెద్ద స్క్రీన్‌లపైకి రానుంది.

Tags:    

Similar News