ఇలా ఇంకెన్నాళ్లు ఊరిస్తావ్ తమన్నా?
ప్రేమించుకున్న వారంతా పెళ్లిళ్లు చేసుకుంటోన్న సంగతి తెలిసిందే. ప్రేమ అనే బంధాన్ని పెళ్లి వరకూ తీసుకెళ్లి ధాంపత్య జీవితాన్ని కొనసాగిస్తున్నారు
ప్రేమించుకున్న వారంతా పెళ్లిళ్లు చేసుకుంటోన్న సంగతి తెలిసిందే. ప్రేమ అనే బంధాన్ని పెళ్లి వరకూ తీసుకెళ్లి ధాంపత్య జీవితాన్ని కొనసాగిస్తున్నారు. గత రెండేళ్లగా సెలబ్రిటీ ఇంట ప్రేమ పెళ్లిళ్లు ఎక్కువ య్యాయి. ఒకప్పుడు రిలేషన్ షిప్ అంటే కొంతకాలానికే పరిమితయ్యేది. కానీ ఇప్పుడా బంధాన్ని జీవితాం తం కొనసాగించే దిశగా చర్యలు తీసుకోవడం సంతోషించదగ్గ విషయం. వయసుల మధ్య వ్యత్యా సంతో కొన్ని రకాల విమర్శలు వస్తున్నప్పటికీ ప్రేమ బంధాన్ని పరిపూర్ణం చేయడానికి చూస్తున్నారు.
పెళ్లికి వయసుతో పనేంటి? అన్న జోడీలు ఎక్కువవుతున్నాయి. మరి తమన్నా-విజయ్ వర్మ జోడీ పెళ్లి ఎప్పుడు చేసుకుంటుంది? అంటే అందుకు సమాధానం మాత్రం దొరకడం లేదు. ఇద్దరు చిలకా గోరింకల్లా విహరిస్తున్నారు తప్ప! పెళ్లి మాట ఎత్తే సరికి స్కిప్ కొట్టే ప్రయత్నమే కనిపిస్తుంది. పరోక్షంగా రకరకాల కారణాలు తెరపైకి తెస్తున్నారు. మరి ఈ డిలే ఎందుకు చేస్తున్నారు? అసలు వాళ్ల మనసుల్లో ఏముందో? తెలియదు గానీ ఈ జంట పెళ్లి వరకూ వెళ్తుందా? అన్న సందేహం కొత్తగా తెరపైకి వస్తోంది.
ప్రస్తుతం తమన్నా వయసు 34 ఏళ్లు కాగా.. విజయ్ వర్మ వయసు 37 ఏళ్లు. ఇద్దరి మధ్య వ్యత్యాసం మూడేళ్లు కనిపిస్తుంది. పెళ్లికి సరైన సమయమే. కానీ ఈ జోడీ ఆ ఛాన్స్ తీసుకోకపోవడంపైనే సందేహాలన్ని. అయితే పెళ్లి కూతురిలా తమన్నా కళ్యాణం మండపంలోకి వెళ్లనప్పటికీ ఇన్ స్టాలో మాత్రం అంతే అందంగా ముస్తాబై అభిమానుల్ని అలరిస్తుంది. డిజైనర్ దుస్తుల్లో అమ్మడు కొత్త పెళ్లి కూతురులా ముస్తాబైన ఫోటోలు అప్పుడప్పుడు షేర్ చేస్తుంది.
ఎండార్స్ మెంట్స్ కార్యక్రమంలో భాగంగా ఇలా ముస్తాబవుతుంది. ఈ రకమైన అలంకరణ పెళ్లికి ముందు ఓ రకమైన ప్రిపరేషన్ లా కూడా కనిపిస్తుంది.అలాగే విజయ్ వర్మ కూడా ఎప్పుడు కుర్తా దుస్తుల్లో ఎక్కువగా కనిపిస్తుంటాడు. శరీరానికి సౌకర్యమైన దుస్తులు కావడంతో వాటినే ఎక్కువగా వేసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటాడు. ఇక ఇద్దరు వృత్తిపరంగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఎవరి సినిమాలతో వారు తీరక లేకుండా గడుపుతున్నారు.