వీడియో: 'ఉయ్ అమ్మా' అంటూ మిల్కీని ఆడుకున్నారు
అందాల కథానాయిక రవీనా టాండన్ కుమార్తె రాషా తడానీ వెండితెరకు పరిచయమవుతున్న సంగతి తెలిసిందే.
అందాల కథానాయిక రవీనా టాండన్ కుమార్తె రాషా తడానీ వెండితెరకు పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. రాషా నటించిన డెబ్యూ చిత్రం `అజాద్` ఈనెల 17న దేశవ్యాప్తంగా విడుదల కానుంది. ఇదే చిత్రంతో అజయ్ దేవగన్ మేనల్లుడు అమన్ దేవగన్ కథానాయకుడిగా పరిచయమవుతున్నాడు. దీంతో ఇద్దరు డెబ్యూలపైనా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే అజాద్ ప్రివ్యూ నుంచి సమీక్షలు అంతర్జాలంలోకి వచ్చేసాయి. అయితే రాషా తడానీపైనే కళ్లన్నీ. ఈ చిత్రంలో కథానాయికగా నటించిన రాషా తడానీ `ఉయ్ అమ్మా ..` అంటూ సాగు స్పెషల్ పాటలోను అదరగొట్టింది. ఇంతకుముందు ఈ పాట యూట్యూబ్ లో విడుదల కాగా, ముఖ్యంగా రాషా అందచందాలు డ్యాన్సులు మతులు చెడగొట్టాయి. డెబ్యూ నటి అదిరిపోయే ఎక్స్ ప్రెషన్స్ కుర్రకారు గుండెల్లో గిలిగింతలు పెట్టాయి.
ఈ ప్రత్యేక గీతం రాషా ఎనర్జీని బయటికి తెచ్చింది. ఇప్పుడు `ఉయ్ అమ్మా` అని ప్రింట్ వేసిన టీషర్ట్ ధరించి ప్రీమియర్ కి హాజరైంది మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా భాటియా. అసలే ముంబై ఫోటోగ్రాఫర్లు అల్లరి గడుగ్గాయిలు కావడంతో తమన్నా ధరించిన టీషర్ట్ ని చూడగానే.. ఉయ్ అమ్మావ్! అంటూ ఆడుకోవడం మొదలెట్టారు. ఓవైపు ఫోటోషూట్ చేస్తూనే `ఉయ్ అమ్మా` అంటూ ఆటపట్టించిన ఫోటోగ్రాఫర్లను చూస్తూ తమన్నా అంతే ఫ్రెండ్లీగా నవ్వేస్తూ కనిపించింది. నిజానికి తమన్నా ముంబై ఫోటోగ్రాఫర్లతో ఎంతో సన్నిహితంగా మెలుగుతారు. వారిని తన స్నేహితులుగానే భావించి ఫోటోషూట్ కి సహకరిస్తుంటారు. అందువల్ల ఫోటోగ్రాఫర్లలో కూడా ఉత్సాహం అంతకంతకు రెట్టింపైంది.
మొత్తానికి నటవారసురాలు రాషా తడానీకి బెస్ట్ విషెస్ చెప్పేందుకు విచ్చేసిన మిల్కీ బ్యూటీకి ఫోటోగ్రాఫర్ల నుంచి గ్రాండ్ వెల్ కం లభించింది. ఉయ్ అమ్మా పేరుతో అజాద్ కి, రాషా కు కూడా ప్రచారం బాగానే కలిసొచ్చింది. 16 జనవరి 2025న జరిగిన `ఆజాద్` ప్రత్యేక ప్రదర్శనలో పరిశ్రమ నుంచి ప్రముఖ స్టార్లు ఈవెంట్‌కు హాజరయ్యారు. అయితే బాలీవుడ్ ఫేవరెట్ జంట తమన్నా భాటియా, విజయ్ వర్మ తమ స్టైలిష్ లుక్ తో ప్రివ్యూలో అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ జంట స్క్రీనింగ్ సమయంలో ప్రేమలో మునిగి తేలుతూ కనిపించారు. ప్రివ్యూ షో వద్ద రాషా తడానీతో పాటు తమన్నా కూడా ప్రత్యేక ఆకర్షణగా మారింది.
సెలబ్రిటీ షోలో తమన్నా భాటియా క్యాజువల్ లుక్ అందరి దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించింది. బాడీ ఫిట్టెడ్ వైట్ రౌండ్ నెక్ టీ-షర్ట్ ధరించిన తమన్నా టీషర్ట్ ముందు భాగంలో `ఉయ్ అమ్మా` అని ప్రింట్ చేసి కనిపించడంతో అది ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. అలాగే డార్క్ డెనిమ్ జీన్స్ ధరించి తమన్నా చాలా కూల్‌గా కనిపించింది. ఇక తమన్నాతో పాటు విజయ్ వర్మ కూడా స్టైలిష్ లెదర్ జాకెట్ సింపుల్ లుక్ లో కనిపించాడు. స్క్రీనింగ్ సమయంలో ఈ జంట సాన్నిహిత్యం అందరి దృష్టినీ ఆకర్షించింది.