తమన్నా హారర్ సీక్వెల్.. ఆ గోడవపై నిర్మాత వివరణ

ఎంతో హడావుడిగా మొదలైన ఈ ప్రాజెక్టు పై దర్శక నిర్మాతలు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు తెలిపారు.

Update: 2024-03-06 12:30 GMT

2022లో పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన "ఒదెలా రైల్వే స్టేషన్" సినిమా టాక్ అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా "ఒదెలా 2" సినిమా రాబోతోంది. ఇటీవల అఫీషియల్ గా సెట్స్ పైకి వచ్చిన ఈ సినిమాలో తమన్నా భాటియా కథానాయికగా నటిస్తోంది. ఎంతో హడావుడిగా మొదలైన ఈ ప్రాజెక్టు పై దర్శక నిర్మాతలు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు తెలిపారు.

అయితే మొదటి భాగాన్ని నిర్మించిన నిర్మాత సీక్వెల్ ప్రాజెక్టు లో లేకపోవడం కొంత హాట్ టాపిక్ గా మారింది. ఎదో గొడవ జరిగి ఉంటుంది అనే రేంజ్ లో కొన్ని కామెంట్స్ కూడా వచ్చాయి. అయితే ఈ విషయంలో మొత్తానికి ఒక క్లారిటీ వచ్చేసింది. దర్శకుడు సంపత్ నంది ఈ మూవీకి నిర్మాతగా మరియు దర్శకత్వ పర్యవేక్షకుడిగా వ్యవహరిస్తున్నప్పటికీ, మొదటి సినిమా నిర్మాత కెకె రాధామోహన్ ఈ ప్రాజెక్ట్‌ను ఎందుకు నిర్మించడం లేదని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. దానికి నిర్మాత ఈ విధంగా సమాధానం ఇచ్చారు.

కెకె రాధా మోహన్‌ నిర్మించిన “భీమ” సినిమా ఈ వారం విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “నేను ఎప్పుడూ సంవత్సరానికి ఒక సినిమానే నిర్మించాలి అనే ఆలోచనతో ఉన్నాను. ఇప్పుడు గోపీచంద్ నటించిన భీమా విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే ఆయుష్ శర్మతో కలిసి హిందీ చిత్రం రుస్లాన్ నిర్మాణ దశకు చేరుకుంది. అదే సమయంలో మేము ఏప్రిల్ నుండి బెల్లంకొండ శ్రీనివాస్ నెక్స్ట్ చిత్రాన్ని స్టార్ట్ చేయబోతున్నాం.

ఈ సినిమాలకు సంబంధించిన ప్రొడక్షన్ వ్యవహారాలలో అలాగే రిలీజ్ విషయంలో నేను బిజీగా ఉండడంతో దర్శకుడు సంపత్ నంది మరో నిర్మాతతో వెళ్లాలని భావించాడు’’ అని రాధామోహన్ అన్నారు. అలాగే, సంపత్ నంది స్క్రిప్ట్ రాసుకున్నప్పుడల్లా తననే సంపాదిస్తారని నేను ఏదో ఒకటి చెబితే కానీ అతను ఇతర నిర్మాతల వద్దకు వెళ్లడని నిర్మాత తెలిపారు.

ప్రస్తుతం రాధా మోహన్ భీమా సినిమాను గ్రాండ్ గా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ఏ హరి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో గోపీచంద్ రెండు విభిన్నమైన పాత్రలలో కనిపించబోతున్నాడు. ఇక పోలీస్ ఆఫీసర్ గా కూడా కనిపిస్తున్న గోపి ఈసారి భీమా కథలో ఫాంటసీ ఎలిమెంట్స్ కూడా హైలెట్ కాబోతున్నాడు. మరి ఈ సినిమా అతనికీ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

Tags:    

Similar News