హెల్మెట్ ధరించని స్టార్ హీరోకి ట్రాఫిక్ పోలీస్ ఝలక్
గ్రేటర్ చెన్నై సోషల్ మీడియాలో హెల్మెట్ లేకుండా బైక్‌పై ఉన్న ప్రశాంత్ , ఇంటర్వ్యూయర్ ఫోటోని పోస్ట్ చేసిన అధికారులు... ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనపై చర్య తీసుకున్నట్టు వెల్లడించారు.
యూట్యూబ్ ఇంటర్వ్యూలో హెల్మెట్ ధరించనందుకు తమిళ నటుడు ప్రశాంత్‌కు ట్రాఫిక్ పోలీస్ జరిమానా విధించారు. ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బైక్ నడుపుతూ హెల్మెట్ ధరించనందుకు నటుడు ప్రశాంత్‌కు, అతడి వెంటే ఉన్న యూట్యూబర్ కి గ్రేటర్ చెన్నై ట్రాఫిక్ పోలీసులు (జిసిటిపి) జరిమానా విధించడం చర్చనీయాంశంగా మారింది. పిలియన్ రైడింగ్ చేస్తున్న ఇంటర్వ్యూయర్ హెల్మెట్ ధరించనందుకు ఈ శిక్ష అమల్లోకి వచ్చింది.
ప్రశాంత్ తాను నటించిన 'అంధగన్'ను ప్రమోట్ చేయడానికి ఇంటర్వ్యూని వైవిధ్యంగా ప్లాన్ చేయాలనుకున్నారు. బైక్ పై వెళుతూ హెల్మెట్ ధరించలేదు. ఈ వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసిన తర్వాత అది పోలీసుల దృష్టికి వచ్చింది. వీడియోలో ప్రశాంత్ బైక్ నడపడం ఎలా నేర్చుకున్నాడో చెబుతున్నాడు. యూట్యూబర్ తనతో పాటే బైక్ పై ఉన్నారు. ఆ ఇద్దరిలో ఎవరూ హెల్మెట్ ధరించలేదు.
గ్రేటర్ చెన్నై సోషల్ మీడియాలో హెల్మెట్ లేకుండా బైక్‌పై ఉన్న ప్రశాంత్ , ఇంటర్వ్యూయర్ ఫోటోని పోస్ట్ చేసిన అధికారులు... ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనపై చర్య తీసుకున్నట్టు వెల్లడించారు. హెల్మెట్ ధరించని రైడర్ మరియు పిలియన్ రైడర్ (వెనక కూచుని ఉన్న) ఇద్దరికీ రూ. 2,000 వసూలు చేస్తారు! అని సైట్ లో పేర్కొన్నారు. ప్రశాంత్ నటించిన తాజా చిత్రం అంధగన్.. బ్లాక్ బస్టర్ అంధాధున్ కి రీమేక్ సినిమా. దీనిని తెలుగులో నితిన్ కథానాయకుడిగా మ్యాస్ట్రో పేరుతో రీమేక్ చేయగా బాక్సాఫీస్ వద్ద ఫెయిలైన సంగతి తెలిసిందే.