మరోసారి తమిళ సినిమాలు డామినేషన్
రీసెంట్గా వినాయక చవితి వచ్చింది. కానీ ఒక్క సరైన తెలుగు సినిమా కూడా రాలేదు. కేవలం డబ్బింగ్ చిత్రాలే కనిపించాయి. విశాల్ హీరోగా మార్క్ ఆంటోనీ బాక్సాఫీస్ ముందు సందడి చేసింది.
తెలుగు చిత్రసీమలో పండగ సీజన్ అంటే.. ప్రేక్షకుల్ని అలరించేందుకు సినిమాలు వరుసగా రెడీ అయిపోతుంటాయి. పండగ బెర్త్‌లను ముందుగానే ఖరారు చేసుకుని బాక్సాఫీస్ ముందు ఆ సమయానికి వచ్చేసి పైసా వసూలు చేసుకుని వెళ్లిపోతాయి. అయితే ఎందుకో ఇప్పుడు సరైన ప్లానింగ్ లేకో మరి ఇతర కారణాల వల్లో కానీ..మంచి సీజన్లను, లాంగ్ వీకెండ్లను మిస్ చేసుకుంటున్నారు దర్శకనిర్మాతలు.
రీసెంట్గా వినాయక చవితి వచ్చింది. కానీ ఒక్క సరైన తెలుగు సినిమా కూడా రాలేదు. కేవలం డబ్బింగ్ చిత్రాలే కనిపించాయి. విశాల్ హీరోగా మార్క్ ఆంటోనీ బాక్సాఫీస్ ముందు సందడి చేసింది. అయినప్పటికీ అది తమిళంలోనే సూపర్ హిట్ గా నిలిచింది. తెలుగులో అంతగా ఆకట్టుకోలేదు. అలా తెలుగు చిత్రసీమకు గణేశుడి సెలవులు వృథా అయిపోయాయి.
ఇక నెక్ట్స్ దసరా రాబోతుంది. అప్పుడు అంతా బాగానే ఉంది. బాలయ్య భగవంత్ కేసరి, రవితేజ టైగర్ నాగేశ్వరరావులు వస్తున్నాయి. కాబట్టి హడావుడి ఎలాగో ఉంటుంది. నో టెన్షన్. కానీ దీపావళికి మళ్లీ సీన్ రివర్స్. తిరిగి డబ్బింగ్ జాతరే కనిపించేలా ఉంది. నవంబర్ 10న తెలుగు నుంచి కేవలం పంజా వైష్ణవ్ తేజ్ నటించిన ఆదికేశవ ఒక్కటే కనిపిస్తోంది. దీని మీద ఎలాగో బజ్ క్రియేట్ అవ్వలేదు.
అయితే అదే ఆ సమయానికి తమిళ చిత్రాలు.. కార్తీ జపాన్, లారెన్స్-ఎస్జె సూర్యల జిగర్తాండ డబుల్ ఎక్స్ఎల్ వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. డిఫరెంట్ జాన్లరతో వస్తున్న ఈ చిత్రలపై మంచి అంచనాలే ఉన్నాయి. దీంతో పాటే చియాన్ విక్రమ్ గౌతమ్ మేనన్ ధృవ నచ్చతీరం కూడా టపాసుల పండగే రావాలని అనుకుంటుందట.
అలాగే హిందీ నుంచి సల్మాన్ ఖాన్ భారీ యాక్షన్ టైగర్ 3 కూడా దాదాపుగా ఫిక్స్ అయిపోయింది. ఎలాగో ఇప్పటికే పఠాన్, జవాన్ చిత్రాలతో ఒక్కసారిగా హిందీ డబ్బింగ్ చిత్రాలకు తెలుగులో మంచి మార్కెట్ ఏర్పడింది. వీటన్నింటి మధ్యలో వైష్ణవ్ ఆదికేశవ నెగ్గుకురావడం అంత ఈజీ కాదు. హిట్ టాక్ వస్తేనే అద్భుతం జరుగుతుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..