TFCC ఎన్నికలపై తమ్మారెడ్డి షాకింగ్ కామెంట్స్

తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి (టీఎఫ్‌సీసీ) ఎన్నికలపై ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కళ్లు చెదిరే వ్యాఖ్యలు చేశారు.

Update: 2023-07-30 09:30 GMT

తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి (టీఎఫ్‌సీసీ) ఎన్నికలపై ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కళ్లు చెదిరే వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల వాతావరణాన్ని గమనిస్తూ, ఛాంబర్ ఎదుగుదలను చూసి సంతోషించాలా లేక సాధారణ ఎన్నికలను పోలి ఉండడంతో ఇబ్బంది పడాలా అనే సందేహాన్ని ఆయన వ్యక్తం చేశారు. సభ్యుల మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో బిత్తరపోయిన ఆయన దీని వెనుక ఉన్న ఉద్దేశాలను ప్రశ్నించారు.

ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా స్వీయానుభ‌వాలు క‌లిగి ఉన్న ఆయ‌న ఛాంబ‌ర్ విజ‌యాల‌ను చ‌విచూసారు. అనేక ఎన్నికల విధానాల‌ను ద‌గ్గ‌ర‌గా చూసిన‌ తమ్మారెడ్డి ప్రస్తుత ఎన్నికల ప్రచారాన్ని భయానకంగా అరుదుగా జ‌రిగేవి అని భావిస్తున్న‌ట్టు తెలిపారు. మునుముందు ఎన్నికల్లో ఇలాంటి తీవ్ర పరిస్థితులు రాకుండా చూడాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

మరోవైపు టీఎఫ్‌సీసీ ఎన్నికల పోలింగ్‌ ఉత్సాహంగా సాగుతోంది. రెండేళ్లకు ఒకసారి జరిగే ఎన్నికల్లో పోటీ చేస్తున్న దిల్ రాజు, సి.కళ్యాణ్ అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీప‌డుతున్నారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగనుంది. ప్రొడ్యూసర్ సెక్టార్, డిస్ట్రిబ్యూషన్ సెక్టార్, స్టూడియో సెక్టార్ , ఎగ్జిక్యూటివ్ సెక్టార్‌లోని ఓటర్లు తమ ఓటు వేయనున్నారు. మొత్తం 1600 మంది సభ్యులుంటే 900 ఓట్లు నమోదవుతాయని అంచనా. సాయంత్రం 4 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమై 6 గంటల తర్వాత ఫలితాలు వెల్లడిస్తారు.

Tags:    

Similar News