బాత్ టవల్ చుట్టుకుని వీధిలో యువతి వీరంగం
ముంబై స్ట్రీట్‌లో టవల్ చుట్టుకుని నడుచుకుంటూ వెళ్లిన అమ్మాయిని చూసి అకస్మాత్తుగా ఖంగు తిన్నారు ప్రజలు.
ముంబై స్ట్రీట్‌లో టవల్ చుట్టుకుని నడుచుకుంటూ వెళ్లిన అమ్మాయిని చూసి అకస్మాత్తుగా ఖంగు తిన్నారు ప్రజలు. ఈ సీన్ వెనక చాలా పెద్ద కథే ఉంది. అదేంటో తెలియాలంటే వివరంలోకి వెళ్లాలి.
సోషల్ మీడియా యుగంలో యూత్ ట్రెండ్‌లు, స్టంట్లు సెకన్లలో వైరల్‌గా మారుతున్నాయి. ఇప్పుడు ముంబై నుండి వచ్చిన ఈ బాత్ టవల్ అమ్మాయి వీడియో నెటిజనుల్లో విస్తృతంగా చర్చకు దారి తీసింది. తీవ్ర విమర్శలకు గురైంది ఈ వీడియో. ఎలాంటి ఆచ్ఛాదనా లేకుండా బాత్ టవల్ ను ఒంటికి చుట్టుకుని రద్దీగా ఉండే వీధిలోకి అడుగుపెట్టిన యువతిని బాటసారులను తథేకంగా చూస్తూ ఆశ్చర్యపోవడం, తననే కొంటెగా చూస్తూ ఉండటం కలకలం రేపింది. అయితే ఇది ఫ్రాంక్ వీడియో అని తెలుసుకున్నాక నెటిజనులు తిట్ల దండకం అందుకున్నారు.
ఇది ప్రఖ్యాత ఫ్యాషన్ పోర్టల్ ప్రచారం. పోర్టల్ తరపున సూపర్‌స్టార్ విజేత అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన హంగామాకు 37,000 మందికి పైగా ఫాలోవర్లు స్పందించారు. పాపులర్ పర్సనాలిటీ అయిన తనుమితా ఘోష్ ఇటీవల ముంబైలోని సందడిగా ఉన్న వీధుల్లో ఇలా బాత్ టవల్‌తో అర్థనగ్న ప్రదర్శనకు దిగింది.
అప్పటి నుండి వైరల్‌గా మారిన ఈ వీడియోలో తనుమిత టవల్‌ను ధరించి ఆత్మవిశ్వాసంతో వీధుల్లో నడిచింది. అప్పుడే స్నానం చేసి బయటికి వచ్చినట్లు అనిపిస్తుంది చూడగానే. దీనికి బ్యాక్ గ్రౌండ్ లో తౌబా-తౌబా పాటను ప్లే చేసారు. క్యాప్షన్‌లో,ముంబైలోని చూపరులు తన రూపాన్ని చూసి `తౌబా-తౌబా` అని ఆశ్చర్యపోతున్నారని తనుమిత కామెడీ చేసింది. అయితే ఈ వింత వేషం ఎలా ఉన్నా కానీ.. చెవిపోగులు- స్టైలిష్ స్పోర్ట్స్ షూస్ ధరించి పబ్లిక్ స్పేస్‌లో నడకలు సాగించినప్పుడు ప్రజలకు అనుమానం రావాలి. వీధిలో బస్ స్టాండ్ నుండి స్థానిక దుకాణం వైపు వెళుతూ.. అప్పుడప్పుడు రెసిడెన్షియల్ కాంప్లెక్స్ ముందు హంగామా సృష్టించింది. ఇంతలోనే అసలు ట్విస్టు రివీలైంది. ఇది చొక్కా మీద చొక్కా తరహాలో అప్పటికే దుస్తులు ధరించి దానిపై బాత్ టవల్‌ని చుట్టుకుంది ఈ భామ. తనుమిత తన జుట్టును కప్పి ఉన్న టవల్‌ను వేగంగా తీసివేసి, దాని తర్వాత తన శరీరం చుట్టూ ఉన్న టవల్‌ను తీసివేయగా అసలు గుట్టు బయటపడింది. ఈ ఊహించని ట్విస్ట్ వీక్షకులను ఆశ్చర్యపరిచింది. ఈ స్టంట్ ఏదైనా కమర్షియల్ ప్రకటన అని అంతా అర్థం చేసుకున్నారు.
అయితే, ఈ వీడియో తీవ్ర విమర్శలకు దారితీసింది. చాలా మంది ప్రేక్షకులు ఇలాంటి డ్రామాలు అవసరమా? అని అమ్మడిని ఛీదరించుకున్నారు. వివాదాస్పదమైనప్పటికీ అందరి దృష్టిని ఆకర్షించాలనే తనుమిత లక్ష్యం విజయవంతమైంది. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది. 10 లక్షలకు పైగా వీక్షణలు, వేలాదిగా లైక్‌లు -షేర్‌లు వచ్చాయి. దీనిపై మెజారిటీ వర్గం కామెంట్లతో విరుచుకుపడ్డారు.
సిమ్రాన్ స్టంట్ అసమంజమైనదని కొట్టిపారేసారు కొందరు. అయితే కామెంట్లకు ప్రతిస్పందనగా తనుమిత ఈ వీడియో 2019 షో నుండి వచ్చినదని, అక్కడ తనకు ఒక నిర్దిష్ట టాస్క్ ఇచ్చారని స్పష్టం చేసింది. ఇది సీరియస్‌గా తీసుకోవలసిన అవసరం లేదని సోనాక్షి సిన్హా, షలీనా నథాని, మనీష్ మల్హోత్రా, డినో మోరియా వంటి ప్రముఖులు డిసైడ్ చేసిన వినోదాత్మక అంశంలో భాగమని తనుమిత చెప్పింది. ఈ వివరణ కూడా ఎవరికీ నచ్చలేదు. ఆన్ లైన్ పైత్యం పరాకాష్టలో నెత్తికెక్కిందని ట్రోల్ చేస్తున్నారు.