ఎన్టీఆర్ వాచ్‌ల ఖరీదు తెలిస్తే నోరెళ్లబెడతారు
నిన్నటికి నిన్న కేజీఎఫ్ ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ సినిమా ఓపెనింగ్ ఫోటోల్లో తారక్ ధరించిన ఖరీదైన వాచ్ గుసగుసలకు తావిచ్చింది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఉన్న అరుదైన హ్యాబిట్ వాచ్ కలెక్షన్. అతడు ఖరీదైన లగ్జరీ బ్రాండ్ వాచ్ లను ధరించేందుకు ఎల్లపుడూ ఆసక్తిని కనబరుస్తున్నారు. ఎన్టీఆర్ దగ్గర ఇప్పటికే పాపులర్ అంతర్జాతీయ బ్రాండ్ వాచీలు ఉన్నాయి. వీటి ఖరీదు లక్షలు అధిగమించి కోట్లలో ఉంది. రిచర్డ్ మిల్లే, బల్గారీ, పటేక్ ఫిలిప్పే బ్రాండ్ల నుంచి అతడు ఖరీదైన వాచ్ లను కొనుగోలు చేసారు. వివరాల్లోకి వెళితే....
నిన్నటికి నిన్న కేజీఎఫ్ ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ సినిమా ఓపెనింగ్ ఫోటోల్లో తారక్ ధరించిన ఖరీదైన వాచ్ గుసగుసలకు తావిచ్చింది. ఈ వాచ్ అహూతుల కళ్లను విపరీతంగా ఆకర్షించింది. ఈ గడియారం ధర సుమారు 2.4కోట్లు అంతకుమించి ఉంటుందని అంచనా. అమెరికాలో ఈ వాచ్ ధర సుమారు 3లక్షల డాలర్లు. భారతదేశానికి దిగుమతి చేస్తే అదనంగా పన్నులు చెల్లించాల్సి ఉంటుంది.
లగ్జరీ గడియారాల ప్రపంచంలో పటేక్ ఫిలిప్ ప్రత్యేకతే వేరు. తారక్ దగ్గర పటేక్ ఫిలిప్ గ్రాండ్ కాంప్లికేషన్స్-రిఫరెన్స్. 5370 వాచ్ ఉంది. ఈ వాచ్ తో తారక్ పలు ఈవెంట్లలో కనిపించారు. పటేక్ ఫిలిప్ గ్రాండ్ కాంప్లికేషన్స్ - రిఫరెన్స్ . 5370 ధర సుమారుగా రూ. 2.46 కోట్లు. బల్గారీ గెరాల్డ్ జెంటా ఆక్టా బి రిట్రో - BG043BSCVABR బ్రాండ్ వాచ్ కూడా తారక్ వద్ద ఉంది. ఈ వాచ్ కంపెనీకి గొప్ప చరిత్ర ఉంది. దీని ధర సుమారుగా రూ.17.10లక్షలు.
తారక్ దగ్గర రిచర్డ్ మిల్లీ బ్రాండ్ వాచ్ కూడా ఉంది. రిచర్డ్ మిల్లే ఆటోమేటిక్ ఫ్లైబ్యాక్ క్రోనోగ్రాఫ్ మెక్లారెన్- RM 11-03 అనేది ఈ వాచ్ పూర్తి పేరు. ధర సుమారుగా INR 4.2కోట్లు. ఖరీదైన వాచ్ లు సెలబ్రిటీ స్టాటస్ కి సింబల్ అనడంలో సందేహం లేదు. రామ్ చరణ్, ప్రభాస్ వద్ద ఖరీదైన వాచ్ లు ఉన్నాయి.