బిగ్ బాస్ 8 : హౌస్ లోకి వచ్చేప్పుడే దేనికైనా సిద్ధమని వచ్చాడా..?

సీజన్ 4 లో ఎక్కడైతే తాను వెనకపడ్డాడు అనిపించిందో దాన్ని సరిచేసుకుని బిగ్ బాస్ సీజన్ 8 లో దేనికైనా రెడీ అన్నట్టుగా అవినాష్ రెడీ అయ్యి వచ్చినట్టు ఉన్నాడు.

Update: 2024-10-18 11:45 GMT

బిగ్ బాస్ సీజన్ 8 లో ప్రస్తుతం మెగా చీఫ్ కంటెండర్ టాస్క్ జరుగుతుంది. చీఫ్ కంటెండర్ గా గెలిచిన నిలిచిన వారికి మరో టాస్క్ ఇచ్చి వారి నుంచి మెగా చీఫ్ ను ఎంపిక చేస్తారు. ఐతే ఈ టాస్క్ లో గెలిచిన ఓజీ క్లాన్ సభ్యులు అందరినీ చీఫ్ కంటెండర్ గా బిగ్ బాస్ ప్రకటించినట్టు తెలుస్తుంది. ఐతే ఈ టాస్క్ లో భాగంగా కుషన్ ల మీద డిఫరెంట్ సింబల్స్ పెట్టి వాటిని బిగ్ బాస్ సూచించిన బాక్స్ లో పెట్టాల్సి ఉంటుంది. ఎవరైతే ముందు పెడతారో వారికి పాయింట్స్ వస్తాయి.

ఇక లేటెస్ట్ గా వచ్చిన నేటి సెకండ్ ప్రోమో చూస్తే హెయిర్ కట్ ఛాలెంజ్ ఇచ్చాడు బిగ్ బాస్. అవినాష్, పృధ్విలకు హెయిర్ కట్ ఛాలెంజ్ ఇచ్చాడు. వారు ఇచ్చిన 3 డిఫరెంట్ స్టైల్స్ లో హెయిర్ కట్ చేసుకుంటే 25000, 50000, 100000 రూపాయలు ప్రైజ్ మనీలో యాడ్ అవుతాయని బిగ్ బాస్ చెప్పాడు. ఐతే పృధ్వి తన హెయిర్ కట్ తో పాటు గడ్డాన్ని సాక్రిఫైజ్ చేయాల్సి ఉంటుంది. అతను నిరాకరించినట్టు తెలుస్తుంది.

మరోపక్క అవినాష్ తన హెయిర్ ని కట్ చేయడానికి రెడీ అయ్యాడు. ప్రస్తుతానికి ప్రోమో ఎవరు హెయిర్ కట్ చేసుకుంటున్నారు అన్నది చూపించలేదు కానీ లైవ్ లో చూస్తే అవినాష్ రెండో మోడల్ గా హెయిర్ కట్ చేయించుకుని 50000 రూపాయలను ప్రైజ్ మనీకి యాడ్ చేశాడు. అటు ఆటలోనూ హౌస్ లో ఎంటర్టైనర్ గా అవినాష్ తన ఫుల్ ఎఫర్ట్స్ పెట్టేస్తున్నాడు. టాస్క్ లో కూడా తను మాక్సిమం ఆడుతున్నాడు.

సీజన్ 4 లో ఎక్కడైతే తాను వెనకపడ్డాడు అనిపించిందో దాన్ని సరిచేసుకుని బిగ్ బాస్ సీజన్ 8 లో దేనికైనా రెడీ అన్నట్టుగా అవినాష్ రెడీ అయ్యి వచ్చినట్టు ఉన్నాడు. కచ్చితంగా అవినాష్ ఈ సీజన్ లో టాప్ 5 లో ఉండే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఐతే ఇదే టాస్క్ లో పృధ్వి తన గడ్డాన్ని ఇవ్వడానికి నిరాకరించాడు. అతను ఆటల్లో తప్ప మిగతా దేనిలో అంత దూకుడుగా లేదన్నది అందరు చెప్పుకుంటున్నారు.

Full View
Tags:    

Similar News