కన్ ఫ్యూజన్ లో బిగ్ బాస్ టీమ్.. ఎందుకంటే..?

ఇక ఇదే కాకుండా బిగ్ బాస్ టైమింగ్స్ విషయంలో కూడా బిగ్ టీం కాస్త కన్ ఫ్యూజన్ లో ఉందని తెలుస్తుంది.

Update: 2024-08-07 03:00 GMT

7 సక్సెస్ ఫుల్ సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ తెలుగు నెక్స్ట్ సీజన్ కు రెడీ అవుతుంది. బిగ్ బాస్ సీజన్ 8 సెప్టెంబర్ 1 నుంచి మొదలవుతుందని తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రోమో, లోగో స్టార్ మా రిలీజ్ చేసింది. బిగ్ బాస్ ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 8 పై ఫ్యాన్స్ చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నారు. ఐతే ఈ సీజన్ విషయంలో బిగ్ బాస్ టీం కొంత కన్ ఫ్యూజన్ లో ఉందని టాక్. ఈ సీజన్ మొదట్లోనే బిగ్ బాస్ హౌస్ ను ఇక్కడ నుంచి చేరే ప్లేస్ కి షిఫ్ట్ చేయాలని అనుకుని అంత టైం లేదని ఈ సీజన్ వరకు ఇక్కడ కానిచ్చేద్దామని వర్క్ మొదలు పెట్టారు.

ఇక ఇదే కాకుండా బిగ్ బాస్ టైమింగ్స్ విషయంలో కూడా బిగ్ టీం కాస్త కన్ ఫ్యూజన్ లో ఉందని తెలుస్తుంది. బిగ్ బాస్ షోని ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు 9 లేదా 9:30 గంటల టైం లో మొదలు పెడతారు. శని, ఆదివారాల్లో మాత్రం నాగార్జున వస్తారు కాబట్టి కచ్చితంగా 9 గంటలకు మొదలు పెడతారు. ఐతే మిగతా రోజుల్లో 9 గంటలకు టెలికాస్ట్ చేసే అవకాశం లేదు.

ఈ టైమింగ్స్ విషయంలో బిగ్ బాస్ టీం కసరత్తు చేస్తుంది. మధ్యలో సీజన్ 6 ని రాత్రి 10 గంటలకు ప్రసారం చేయడం వల్ల ఆ ఎఫెక్ట్ బాగా చూపించింది. అందుకే రాత్రి 9 లేదా 9:30 గంటలకు మాత్రమే బిగ్ బాస్ వస్తే బెటర్ అని ఆడియన్స్ కూడా అంటున్నారు. ఇక మరోపక్క బిగ్ బాస్ సీజన్ 8 ని ఓటీటీ లైవ్ ఇచ్చే విధంగా చర్చలు జరుగుతున్నాయి.

ఐతే ఓటీటీ లైవ్ ఇవ్వడం మొదలు పెట్టిన దగ్గర నుంచి మొత్తం 24 గంటలు చూసిన కొందరు అసలు ఎపిసోడ్ మీద విమర్శలు చేస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ మొదలైన కొత్తలో ఈ సమస్య ఉండేది కాదు స్టార్ మా ఎలా చూపిస్తే అలా ఉండేది. కానీ ఏదైనా గొడవకు సంబంధిన క్లరిటీ కోసం కొందరు 24 గంటల ఫుటేజ్ చూసి బిగ్ బాస్ జడ్జిమెంట్ మీద తప్పు చూపిస్తున్నారు. సో ఇదంతా దేనికి అనుకుంటూ 24 గంటల లైవ్ ఇవ్వాలా వద్దా అన్నది కూడా ఆలోచిస్తున్నారని తెలుస్తుంది. బిగ్ బాస్ టీం దీనిపై ఒక క్లారిటీకి వచ్చి త్వరలోనే కంటెస్టెంట్స్ ని సెలెక్ట్ చేస్తారని తెలుస్తుంది.

Tags:    

Similar News