పాకిస్తాన్ లో ఏ తెలుగు హీరో టాప్ లో?

పుట్టిన రోజు వేడుక‌లు వ‌చ్చినా సోష‌ల్ మీడియా వేదిక‌గా విషెస్ తెలియ‌జేస్తుంటారు.

Update: 2024-03-10 09:53 GMT

దాయాది పాకిస్తాన్ లో బాలీవుడ్ హీరోల క్రేజ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. భార‌తీయ నటులైనా కొంద‌రు బాలీవుడ్ హీరోల్ని పాక్ అభిమానులు నెత్తిన పెట్టుకుని పూజిస్తారు. షారుక్ ఖాన్..అమీర్ ఖాన్.. స‌ల్మాన్ ఖాన్ లాంటి న‌టుల సినిమాల‌కు అక్క‌డ మంచి డిమాండ్ ఉంటుంది. ఆ హీరోల సినిమాలు చూడ‌టానికి పాకిస్తానీయులు ఎంతో ఆస‌క్తి చూపిస్తుంటారు. పుట్టిన రోజు వేడుక‌లు వ‌చ్చినా సోష‌ల్ మీడియా వేదిక‌గా విషెస్ తెలియ‌జేస్తుంటారు.


మ‌రి ఇదే ఆద‌ర‌ణ టాలీవుడ్ హీరోల‌కు కూడా ద‌క్కుతుందా? అంటే అవున‌నే తెలుస్తోంది. ఇప్ప‌టికే తెలుగు సినిమాల‌కు పాకిస్తాన్ అభిమానులు ప్ర‌త్యేక రివ్యూలు ఇస్తోన్న సంగ‌తి తెలిసిందే. యూ ట్యూబ్ లో తెలుగు సినిమాలు చూస్తూ ర‌క‌ర‌కాల ఎక్స్ ప్రెష‌న్స్ తో రివ్యూలు ఇస్తున్నారు. తొలుత ఈ విధానం హిందీ సినిమా ల‌కు మాత్ర‌మే క‌నిపించేది. ఇప్పుడు పాన్ ఇండియాలో దూసుకుపోతున్న తెలుగు సినిమాల‌కు పాక్ అభిమానుల నుంచి రివ్యూలు రావ‌డం విశేషం.

ఇక `ఆర్ ఆర్ ఆర్` త‌ర్వాత యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్...మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ని కూడా అక్క‌డ అభిమానులు ఆద‌రిచండం మొద‌లు పెట్టారు. ఈ సినిమాతో ఇద్ద‌రికీ గ్లోబ‌ల్ స్థాయిలో మంచి గుర్తింపు ద‌క్కింది. ఆస్కార్ ద‌క్కించుకోవ‌డంతో హాలీవుడ్ సైతం పిలిచి అవ‌కాశాలిస్తుంది. ఇప్పుడా గుర్తింపుతోనే పాకిస్తాన్ అభిమానులు ఆ ఇద్ద‌ర్నీ విప‌రీతంగా ఆద‌రిస్తున్నారు? అన్న సంగ‌తి బ‌య‌ట‌కు వ‌చ్చింది.

దేశంతో ఎలాంటి విబేధాలు ఉన్నా వాట‌న్నింటిని ప‌క్క‌న‌బెట్టి సగ‌టు సినీ ప్రేక్ష‌కుడిగా ఆ ఇద్ద‌రు తెలుగు న‌టుల్ని ఆరాదిస్తున్నారు. ఇటీవ‌ల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా వాళ్ల స‌ర‌స‌న చేరాడు. `పుష్ప` సినిమా తో బ‌న్నీకి పాక్ లో ఆద‌ర‌ణ మొద‌లైంది. అయితే ఆ ముగ్గురిలో మెజార్టీ వ‌ర్గం అభిమానించేది ఏ హీరోని? బాలీవుడ్ హీరోల్ని కూడా క‌లుపుకుంటే ఎవ‌రు ఉత్త‌మ స్థానంలో ఉన్నారు? అన్న‌ది ఇప్పుడు పెద్ద టాస్క్.

Tags:    

Similar News