తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్3లో జాయిన్ అవుతున్న విజయ్ దేవరకొండ

Update: 2024-07-03 04:20 GMT

తెలుగు ఇండియన్ ఐడల్ 3 గ్రాండ్ గాలా అదిరిపోయింది. టాప్ 12 సింగర్స్‌తో కూడిన గ్రాండ్ గాలా ఎపిసోడ్స్ తెలుగులో రియాల్టీ షోలలో కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసింది. ఈ సీజన్ గ్రాండ్ గాలా ఆడియన్స్, జడ్జస్ ని మెస్మరైజ్ చేసి చార్ట్ బస్టర్ హిట్ గా నిలిచింది.

గ్రాండ్ గాలా ఎపిసోడ్స్ ఆడియన్స్ కి సరికొత్త అనుభూతిని పంచాయి. చెన్నై స్ట్రింగ్స్ ఆర్కెస్ట్రా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టారు. దాదాపు 5000లకు పైగా సినిమాలకి పని చేసి చెన్నై స్ట్రింగ్స్ ఆర్కెస్ట్రా గ్రాండ్ గాలా ఎపిసోడ్స్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.

సెన్సేషనల్ కంపోజర్ థమన్, యంగ్ సింగర్ స్కందతో కలిసి వేదికపైకి రావడం మరో హైలట్. వారిద్దరి పెర్ఫార్మెన్స్ ఎనర్జీని నింపింది. థమన్, కార్తీక్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలైన "గేమ్ ఛేంజర్", "పుష్ప 2"లో తమ వర్క్ గురించి చెప్పడం అందరినీ అలరించింది.

థమన్ తన సూపర్ హిట్ "మగువా మగువా" పాట వెనుక స్ఫూర్తిని పంచుకోవడం హార్ట్ టచ్చింగ్ మూమెంట్. తన తల్లికి ట్రిబ్యుట్ గా ఈ పాట చేశాని చెప్పడం ఎమోషనల్ డెప్త్ జోడించింది.

మాస్ట్రో ఇళయరాజాకి శ్రీ కీర్తి యొక్క అద్భుత ప్రదర్శన యొక్క వీడియోను పంపాలని కార్తీక్ డిసైడ్ అవ్వడం మరో హైలెట్.

యువ గాయని కీర్తన జడ్జ్ కార్తీక్‌కు మ్యూజిక్ లెసన్ ని చెప్పడం మరో ఆకర్షణగా నిలిచింది. ఇది నెక్స్ట్ జనరేషన్ ట్యాలెంట్ ప్రజెంట్ చేసింది. మొత్తనికి సరికొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసిన తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 గ్రాండ్ గాలా మస్ట్ వాచ్ షో గా నిలిచింది.

ఇప్పుడీ షోలో మరో బిగ్గెస్ట్ ఎట్రాక్షన్ చేరనుంది. ఈ వారం ఎపిసోడ్స్ కి స్పెషల్ గెస్ట్ గా 'కల్కి 2898 ఏ.డీ'లో అర్జునుడిగా కనిపించి సరికొత్త చరిత్ర సృస్టించిన యూత్ సెన్సేషన్, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ వస్తున్నారు. విజయ్ ఎలక్ట్రిఫైయింగ్ ప్రజెన్స్ తో తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 నెక్స్ట్ లెవల్ ఎంటర్ టైన్మెంట్ ఇవ్వబోతోంది.

అందరి ఫేవరేట్ తెలుగు ఇండియన్ ఐడల్ 3 ఆహాలో ప్రతి శుక్రవారం, శనివారం రాత్రి 7 గంటలకు ప్రసారం అవుతుంది.

"తెలుగు ఇండియన్ ఐడల్ 3" ని "ఆహా" లో స్ట్రీమ్ చేసుకోవడం కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి: https://aha.app.link/vJsd7rp5MKb

Content Produced by: Indian Clicks, LLC

Tags:    

Similar News