లోకేష్ మల్టివర్స్.. 171 అంతకుమించి
అయితే ఆ ప్రాజెక్టు ఇంకా విడుదల కాకముందే లోకేష్ మరొక ఆసక్తికరమైన ప్రాజెక్టును లైన్ లోకి తీసుకువస్తూ ఉన్నాడు
టాలెంటెడ్ కోలీవుడ్ దర్శకుడు లోకేష్ కనకగరాజ్ అనుకున్న ప్రాజెక్టులు అన్నీ కూడా సమయానికి మొదలుపెట్టి వీలైనంత తొందరగా వాటిని పూర్తి చేస్తూ ఉన్నాడుమ్ ప్రస్తుతం స్టార్ దర్శకులు ఒక్కో సినిమాకు ఏడాది లేదా రెండేళ్ల సమయాన్ని తీసుకుంటూ ఉండగా ఈ దర్శకుడు మాత్రం మినిమం ఆరేళ్ల టార్గెట్ పెట్టుకుని ప్రొడక్షన్ పనులు అన్నిటిని కూడా పూర్తి చేసుకుంటూ ఉండడం హాట్ టాపిక్ గా నిలుస్తోంది.
కథ సెట్ అయితే చాలు హీరోలు కూడా ఈ దర్శకుడికి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇక ప్రస్తుతం లియో సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో అయితే హీరో విజయ్ అత్యధిక వేగంగా ఫినిష్ చేసిన సినిమా ఇదే అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా ఈ దసరాకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.
అయితే ఆ ప్రాజెక్టు ఇంకా విడుదల కాకముందే లోకేష్ మరొక ఆసక్తికరమైన ప్రాజెక్టును లైన్ లోకి తీసుకువస్తూ ఉన్నాడు. జైలర్ సినిమాతో మంచి సక్సెస్ అందుకొని ఫామ్ లోకి వచ్చిన సూపర్ స్టార్ రజినీకాంత్ తో ఇప్పుడు లోకేష్ సినిమా చేయబోతున్నాడు. గత వారం రోజులుగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అనేక రకాల గాసిప్స్ అయితే వైరల్ అవుతున్నాయి.
ఇక మొత్తానికి రజనీకాంత్ 171 ప్రాజెక్టుకు దర్శకుడు లోకేష్ అని అధికారికంగా సన్ పిక్చర్స్ క్లారిటీ ఇచ్చింది. ఇక ఈ సినిమాను కూడా దర్శకుడు మల్టీవర్స్ తరహాలోనే తెరపైకి తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. లియో సినిమాలో కూడా విక్రమ్ అలాగే ఖైదీ సినిమాకు సంబంధించిన పాయింట్స్ ఉండబోతున్నట్లు సమాచారం ఇక ఇప్పుడు రజనీకాంత్ 171 కథకు కూడా పాత క్యారెక్టర్స్ తో లింక్ అయ్యేలా దర్శకుడు రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది.
ఇక తెలుగులో కూడా లోకేష్ కనకగరాజ్ ప్రముఖ హీరోలను గతంలో అయితే సంప్రదించాడు. ఇక లిస్టులో ప్రభాస్ రామ్ చరణ్ కూడా ఉన్నట్లు చాలా రకాల రూమర్స్ అయితే వినిపించాయి. ఇక ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ లోకేష్ యూనివర్స్ లో చేరడంతో అతనిపై మరింత ఫోకస్ అయితే పెరిగింది. రాబోయే రోజుల్లో తెలుగు హీరోలు కూడా ఇతని దృష్టిలో పడితే మాత్రం కంటెంట్ మరొక రేంజ్ లో ఉంటుంది. ఇక ఈ ప్రాజెక్టును లోకేష్ వీలైనంత త్వరగా పూర్తిచేసి వచ్చేయడానికి దీపావళికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నాడు.