విజయ్-అజిత్ ఏం ప్లాన్ చేశారు బాస్..!

కోలీవుడ్ స్టార్ హీరోలైన విజయ్ అజిత్ ల ఫ్యాన్స్ మధ్య ఫైట్ అందరికీ తెలిసిందే. తమిళ చిత్ర పరిశ్రమలో వారిద్దరి క్రేజ్ వేరే లెవెల్ లో ఉంటుంది.

Update: 2024-09-01 10:30 GMT

కోలీవుడ్ స్టార్ హీరోలైన విజయ్ అజిత్ ల ఫ్యాన్స్ మధ్య ఫైట్ అందరికీ తెలిసిందే. తమిళ చిత్ర పరిశ్రమలో వారిద్దరి క్రేజ్ వేరే లెవెల్ లో ఉంటుంది. ఎవరి స్టామినా వారిదే. ఐతే ఇద్దరి సినిమాల టైం లో ఫ్యాన్ వార్స్ ఒక రేంజ్ లో జరుగుతాయి. విజయ్ ప్రస్తుతం ది గోట్ సినిమాతో రాబోతున్నారు. వెంకట్ ప్రభు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 5న రిలీజ్ అవుతుంది. మన దగ్గర పెద్దగా హడావిడి లేదు కానీ కోలీవుడ్ లో ది గోట్ మీద భారీ అంచనాలే ఉన్నాయి.

ఐతే విజయ్ గోట్ సినిమాలో అజిత్ ఫ్యాన్స్ కి ఒక సర్ ప్రైజ్ అని చెప్పి షాక్ ఇచ్చారు డైరెక్టర్ వెంకట్ ప్రభు. ఈ కామెంట్ తో కొంపదీసి విజయ్ గోట్ లో అజిత్ గెస్ట్ రోల్ చేశాడా ఏంటని ఫ్యాన్స్ డౌట్ పడుతున్నారు. విజయ్ అజిత్ ఇద్దరు ఒకే సినిమాలో నటిస్తే థియేటర్లు స్టేడియాలుగా మారతాయని డైరెక్టర్ వెంకట్ ప్రభు అన్నారు. ఐతే అజిత్ ఫ్యాన్స్ కి విజయ్ గోట్ లో ఒక సర్ ప్రైజ్ ఉందని సస్పెన్స్ లో పెట్టారు. అంతేకాదు అజిత్ నటిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీలో కూడా విజయ్ ప్రస్తావన ఉంటుందని ఆయన అన్నారు.

మరి ఇలా ఒక కామెంట్ వదిలి మీ ఊహలకే వదిలేస్తున్నాం అంటే ఫ్యాన్స్ ఏం జరుగుతుంది అని బుర్రలు వేడెక్కేలా ఆలోచించుతారని డైరెక్టర్ గెస్ చేయకపోతే ఎలా. ఏది ఏమైనా ఇద్దరి హీరోల ఫ్యాన్స్ కి ఒక ఎగ్జైట్ కలిగించే న్యూస్ చెప్పి మరింత జోష్ పెంచారని చెప్పొచ్చు. విజయ్ ది గోట్ సినిమాలో మీనాక్షి చౌదరి, త్రిష హీరోయిన్స్ గా నటించగా సినిమాలో డీ ఏజింగ్ టెక్నాలజీ వాడారని తెలుస్తుంది.

ఇక అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ విషయానికి వస్తే ఆధిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాను 2025 సంక్రాంతికి రిలీజ్ లాక్ చేశారు. విజయ్ ది గోట్ ఏమో కానీ అజిత్ సినిమా మాత్రం తెలుగులో కూడా భారీగానే రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు మైత్రి మేకర్స్.

Tags:    

Similar News