ఆటోలో కూర్చుని కూడా మ్యూజిక్ ఇస్తా..!

ఐతే ఇన్నేళ్ల కెరీర్ లో తన మ్యూజిక్ గురించి.. నిర్మాతల గురించి రీసెంట్ ఇంటర్వ్యూలో మీడియాతో పంచుకున్నాడు థమన్.

Update: 2024-11-16 16:30 GMT

వరుస స్టార్ సినిమాలతో అదరగొడుతూ ముఖ్యంగా బిజిఎం ఇవ్వాలంటే అది థమన్ తర్వాతే ఎవరైనా అనేలా క్రేజ్ తెచ్చుకున్నాడు ఎస్.ఎస్.థమన్. మ్యూజిక్ డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టి చాలా ఏళ్లు అవుతున్నా ఈమధ్య థమన్ చేస్తున్న సినిమాలు అందిస్తున్న మ్యూజిక్ అద్భుతంగా ఉంటున్నాయి. ఐతే ఇన్నేళ్ల కెరీర్ లో తన మ్యూజిక్ గురించి.. నిర్మాతల గురించి రీసెంట్ ఇంటర్వ్యూలో మీడియాతో పంచుకున్నాడు థమన్.

తాను ఎప్పుడూ నిర్మాతల సంగీత దర్శకుడినే అంటున్నాడు థమన్. వారు నష్టపోకుండా చూడాలని తాను ఆలోచిస్తానని అన్నారు. అందుకే మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం బయట దేశాలకు వెళ్లనని.. ఆటోలో కూర్చోబెట్టి మ్యూజిక్ ఇవ్వమన్నా ఇస్తానని అన్నారు థమన్. వరుస చిత్రాలతో తానేమి ఒత్తిడి ఫీల్ అవ్వట్లేదని అంటున్న థమన్ ఈ సినిమాలన్నీ ఒకదానితో మరొకటి సంబంధం లేనిదే అని అన్నారు. కెరీర్ లో 2014 నంచి 2016 మధ్యలో కొన్ని రొటీన్ సినిమాలు చేశా.. అప్పుడు మూస ధోరణిలో ఇరుక్కుపోయిన భావన వచ్చిందని అన్నారు. అందుకే ఇప్పుడు అలా సినిమాలు ఒప్పుకోవట్లేదని అన్నారు థమన్.

పుష్ప 2 లో భాగమైనందుకు సంతోషంగా ఉందని అన్న థమన్ అది అనుకోకుండా చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. అల్లు అర్జున్ కోసమే ఆ సినిమాకు పనిచేశానని అన్నారు. పుష్ప 2 చాలా అద్భుతంగా వస్తుంది. కచ్చితంగా సినిమా అల్లు అర్జున్ కి అవార్డులు తెస్తాయని అన్నారు. వీటితో పాటు తాను పనిచేస్తున్న రాజా సాబ్ మంచి కమర్షియల్ ఆల్బం అని చెప్పారు థమన్. అందులో ఒక రీమిక్స్ సాంగ్ ఉందని.. పాన్ ఇండియా మార్కెట్ కు అనుగుణంగా అందరినీ అలరించే పాట రీమిక్స్ చేశామని అన్నారు థమన్.

అదే క్రమంలో ఓజీ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు థమన్. ఓజీ మంచి గ్యాంగ్ స్టర్ సినిమా. తమిళ పరిశ్రమ నుంచి వస్తున్న పోటీకి మనం ఇచ్చే సరైన సమాధానం ఆ సినిమా. ఈ సినిమా కోసం కొరియన్ మ్యూజిక్ బృందంతో కూడా పనిచేశామని చెప్పారు థమన్. ఓజీ సినిమాకు ఇండియాలో ఏ సినిమాకు రాని ఓపెనింగ్స్ వస్తాయని అన్నారు థమన్.

ఇక వీటితో పాటు డాకు మహారాజ్, గేమ్ చేంజర్ సినిమాలు చేస్తున్నానని అన్నారు. సిద్ధుతో తెలుసు కదా.. అఖండ 2 కూడా మొదలవ్వాల్సి ఉందని అన్నారు. అల్లు అర్జున్ త్రివిక్రం సినిమాలకు కూడా తానే మ్యూజిక్ అందిస్తున్న విషయాన్ని చెప్పారు థమన్.

ఒక మ్యూజిక్ డైరెక్టర్ గ సంగీతం మీద ఆసక్తి ఉండి ఆర్దికంగా వెనకబడిన వారికి ఉచితంగా సంగీతం నేర్పించాలని ఉందని థమన్ అన్నారు. అందుకే ఒక మ్యూజిక్ స్కూల్ కట్టాలని ఉందని అన్నారు. 2, 3 ఏళ్లలో హైదరాబా లో ప్రపంచస్థాయి మ్యూజిక్ స్టూడియోని కట్టాలని ఉందని అన్నారు థమన్. అందరి సపోర్ట్ తో అది నెరవేరుతుందని ఆశిస్తున్నా అన్నారు. తాను నమ్మేది మ్యూజిక్ ఒక్కటే అని.. అది ఉన్న చోట నేరాల రేటు కూడా తక్కువగా ఉంటుందని అన్నారు థమన్.

వరుస స్టార్ సినిమాలతో తన మ్యూజిక్ తో అటు ఫ్యాన్స్ ని ఇటు ఆడియన్స్ ని అలరిస్తున్న థమన్ పుట్టినరోజు నేడు. ఇలానే అతను మరెన్నో సక్సెస్ ఫుల్ ఆల్బమ్స్ అందించాలని కోరుకుంటూ థమన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుదాం.

Tags:    

Similar News