థమన్ ఛార్జ్ తీసుకున్నాడంటే..!
ఏదైనా సినిమా థమన్ మ్యూజిక్ ఇస్తున్నాడు అంటే అది నెక్స్ట్ లెవెల్ అనే రేంజ్ కి వెళ్లాడు.
ఏడాదికి వందల కొద్దీ సినిమాలు.. పదుల కొద్దీ హీరోలు, హీరోయిన్స్ అందులో స్టార్ కేటగిరి కూడా ఐతే వీళ్లంతా సినిమా తీయడానికి ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎలా అవసరమో ప్రతి సినిమాకు సంగీత దర్శకుడు కూడా అంతే అవసరం. టాలీవుడ్ లో అయితే సక్సెస్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్స్ పేర్లు చెప్పాలంటే పట్టుమని పదిమంది కూడా ఉండరు. ఐతే వీరిలో తమకు వచ్చిన ఛాన్స్ ని అన్ని విధాలుగా వాడుకుని అదరగొట్టే వారు కొందరు ఉన్నారు. అలాంటి వారిలో ప్రస్తుతం సూపర్ ఫాంలో ఉన్నాడు మ్యూజిక్ డైరెక్టర్ థమన్.
ఏదైనా సినిమా థమన్ మ్యూజిక్ ఇస్తున్నాడు అంటే అది నెక్స్ట్ లెవెల్ అనే రేంజ్ కి వెళ్లాడు. సాంగ్స్ ఏమో కానీ బిజిఎం మాత్రం థమన్ మార్క్ ఉంటుంది. ముఖ్యంగా స్టార్ సినిమాలకు థమన్ ఇచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వీరె లెవెల్ అనిపిస్తుంది. స్టార్స్ అందరితో సినిమాలు చేస్తున్న థమన్ బాలకృష్ణ సినిమాకు మాత్రం స్పెషల్ కేర్ తీసుకుంతాడు. ఈమధ్య కాలంలో బాలకృష్ణ, థమన్ కాంబో సూపర్ డూపర్ మ్యూజికల్ హిట్లు అవుతున్నాయి.
బాలయ్య సినిమా అనగానే థమన్ కి ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది. తెర మీద బాలకృష్ణ వీరత్వానికి థమన్ బిజిఎం యాడ్ అవుతూ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేస్తుంది. అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరితో హ్యాట్రిక్ అందుకున్న ఈ కాంబో ఇప్పుడు డాకు మహారాజ్ తో వస్తుంది. డాకు మహారాజ్ లో కూడా థమన్ మరోసారి బాలయ్య మీద ఉన్న తన అభిమానాన్ని చూపిస్తున్నాడు. అక్కడ కోలీవుడ్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ ఎలా ప్రతి సినిమాకు సూపర్ హిట్ మ్యూజిక్ ఇస్తున్నాడో అలా బాలకృష్ణ సినిమాకు థమన్ పూనకాల మ్యూజిక్ ఇస్తున్నాడు.
అఖండ సినిమా టైం లో యూఎస్ లో స్పీకర్స్ కూడా బ్లాస్ట్ అయ్యేలా మ్యూజిక్ ఇచ్చాడు థమన్. ప్రస్తుతం డాకు మహారాజ్ వస్తుండగా త్వరలో అఖండ 2 కి కూడా థమన్ వర్క్ స్టార్ట్ చేస్తున్నాడు. బాలయ్య సినిమాకు థమన్ ఇస్తున్న మ్యూజిక్ కూడా ఫ్యాన్స్ థమన్ కి రెగ్యులర్ గా ఇచ్చే రెమ్యునరేషన్ కన్నా డబుల్ పారితోషికం ఇచ్చినా తప్పులేదని అంటున్నారు. మొత్తానికి బాలకృష్ణ వరుస సినిమాలు చేస్తూ నందమూరి హీరోకి పర్మినెంట్ మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ ఫిక్స్ అయ్యాడని చెప్పొచ్చు.